అభ్యర్థులను ఖరారు చేయలేక సమీక్షల మీద సమీక్షలు జరుపుతు తల పట్టుకుంటున్న చంద్రబాబు

అభ్యర్థులు ఖరారు అయిపోయారన్న సీట్లకే మళ్లీ సమీక్షలు నిర్వహించడం..

మొదట ఒకరి పేరును లీక్ ఇవ్వడo వారికే టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు అని అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయడం.

ఆ తర్వాత మళ్లీ అదే నియోజకవర్గానికి సంబంధించే సమీక్షలు నిర్వహించడం..

ఒలికిపోయడం, ఎత్తుకోవడం.. అన్నట్టుగా సాగుతోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ.

నెలరోజుల కిందటే అభ్యర్థులు ఖరారు అయ్యారని చెప్పిన సీట్లకు కూడా ఇప్పుడు మళ్లీ సమీక్షలు జరుగుతూ ఉండటమే అత్యంత ఆశ్చర్యకరమైన అంశం అవుతోంది.

ఒకటికాదు రెండుకాదు.. నలభై సీట్ల విషయంలో తర్జనభర్జనలు కొనసాగుతూ ఉండటం విశేషం.

గమనించాల్సిన అంశం ఏమిటంటే.. వీటిపై ఇప్పటి వరకే సమీక్షలు పూర్తిఅయ్యాయి. ఎవరో ఒకరి పేరును లీక్ గా ఇచ్చారు. అయితే వారికి టికెట్ ఖరారు కాలేదు అనేది లేటెస్ట్ అప్ డేట్!

ఒక్కో నియోజకవర్గంలో చంద్రబాబు నాయడు సమీక్షలు ఎలా సాగుతున్నాయంటే.. మొదట ఆశావహులను పిలిపించుకుని మాట్లాడుతూ ఉన్నారు. వారి వారి వెర్షన్లు విన్న తర్వాత వారిని పంపించేస్తూ ఉన్నారు.

తర్వాత మీడియాకు ఒక లీక్ ఇస్తున్నారు. ఫలానా వారికి అభ్యర్థిత్వం ఖరారు అయ్యిందని చెబుతున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఆ హడావుడి ఉండదు.

పిలిచిన వారిని మళ్లీ సమీక్షలకు పిలుస్తున్న దాఖలాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తమను పిలిచి మళ్లీ అడిగిన ప్రశ్నలే అడుగుతూ ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఆశావహులు చెబుతూ ఉండటం విశేషం.

అయినా తాము ఓపికగా అన్నీ చెబుతున్నట్టుగా వివరిస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం తమను తీవ్రంగా టెన్షన్ పెడుతోందని వాపోతూ ఉన్నారు.

ఈ క్రమంలో చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ అస్వస్థతకు గురి అయ్యారు. టికెట్ విషయంలో టెన్షన్ ఆమెను అస్వస్థతకు గురి చేసినట్టుగా తెలుస్తోంది.

జనవరిలోనే తొలిజాబితా అని తెలుగుదేశం అనుకూల మీడియా హడావుడి చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే.. చంద్రబాబు కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించేస్తారని హడావుడి చేశారు. తీరా.. మార్చి రెండోవారం వస్తున్నా పరిస్థితి ఇలా ఉంది.

ఇక మరోవైపు చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి కార్యకలాపాలు తీవ్ర స్థాయికి చేరిపోయాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై గట్టిగా వ్యతిరేక వర్గాలు హడావుడి చేస్తున్నాయి.

వారికి టికెట్ ఇస్తే తాము ఓడిస్తామని తెలుగుదేశం నేతలు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *