బాబు పేపర్ యాడ్స్ పై కాగ్ రిపోర్ట్!

ఇబ్బడిముబ్బడిగా పత్రికలకు అందునా.. ఆ రెండు పత్రికలకూ యాడ్స్ ఇవ్వడానికి చంద్రబాబు సర్కారు ఏ మాత్రం మొహమాటపడలేదు.

భజన చేసే అనేక టీవీ చానళ్లకు కూడా ఏపీ ప్రభుత్వం భారీఎత్తున ప్రకటనలు ఇస్తూ వస్తోంది.

మీడియాధినేతలకు బాబు చాటుగా చేకూర్చి పెట్టే లబ్ధిగురించి ఇటీవలే మాజీ సీఎస్ ఒకరు మాట్లాడారు.

ఆ సంగతలా ఉంటే.. బాబు సొంత ఆర్భాటానికి ఏపీ ప్రభుత్వ ఖజనా నుంచి పత్రికలకు ఇచ్చిన ప్రకటనల గురించి కాగ్ రిపోర్టును ఇచ్చింది.

కేవలం చంద్రబాబు నాయుడి ఇమేజ్ పెంచేందుకు మాత్రమే ఇచ్చిన యాడ్స్, వాటికి అయిన ఖర్చు గురించి కాగ్ నివేదికలో పేర్కొంది.

బాబు ఈ మధ్యకాలంలో ప్రభుత్వ సొమ్ముతో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ధర్మపోరాట దీక్షలని, నవ నిర్మాణ దీక్షలనీ.. గట్రా. వీటి ఏర్పాట్ల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారని.

ఆ ఖర్చులో పెద్దఎత్తున అవినీతి కూడా జరుగుతోందని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న వారు చెబుతున్నారు. ఏర్పాట్లు, జనాలను తరలించడం, వాళ్ల కోసం భోజనాలు.. అవన్నీ గాక.. పత్రికలకు యాడ్స్ మరో ఎత్తు.

ఈ రోజుల్లో వార్తా పత్రికల్లో యాడ్స్ అంత చిన్న విషయం ఏమీ కాదు. ప్రింట్ ఖరీదు అయిపోవడంతో.. పత్రికలకు యాడ్స్ మాత్రమే  రెవెన్యూ కావడంతో.. అవి యాడ్ రేట్ ను భారీగా పెంచేశాయి. 

ఈ నేపథ్యంలో కూడా బాబు ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తూనే ఉంది ఈ పరిణామాల మధ్యన బాబు సొంత డబ్బా కోసం ఇచ్చిన పత్రికల ప్రకటనలను కాగ్ ప్రస్తావించింది.

CM Chandrababu to Announce MLA Candidates List for AP
CM Chandrababu to Announce MLA Candidates List for AP

చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా చేసిన నిరాహార దీక్ష ఖర్చు ఇరవై కోట్ల రూపాయల పైనే అని ఇదివరకే వార్తలు వచ్చాయి.

జనాలను తరలించడానికి, వచ్చిన జనాలకు ఏర్పాట్లు చేయడానికి, కమిషన్లు అన్నీ కలుపుకుంటే ఖజానాకు ఇరవై కోట్ల రూపాయల పైనే చిల్లు పెట్టారని వార్తలు వచ్చాయి.

ఈ పరిణామాల మధ్యన బాబు సొంత డబ్బా కోసం ఇచ్చిన పత్రికల ప్రకటనలను కాగ్ ప్రస్తావించింది.

చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా చేసిన నిరాహార దీక్ష ఖర్చు ఇరవై కోట్ల రూపాయల పైనే అని ఇదివరకే వార్తలు వచ్చాయి.

ఆ రోజుకు సంబంధించి పత్రికల్లో ప్రకటనలకు వెచ్చించిన మొత్తం రెండు కోట్ల రూపాయల వరకూ ఉందని కాగ్ పేర్కొంది.

ఇక అంబేద్కర్ ఆశయం.. చంద్రన్న ఆదరణ అంటూ చేపట్టిన మరో ప్రోగ్రామ్ కోసం బాబు ఫొటోలతో ఇచ్చిన యాడ్స్ విలువ అక్షరాలా మూడు కోట్ల రూపాయలని కాగ్ వివరించింది.

నవనిర్మాణ దీక్ష పేరుతో బాబు చేపట్టిన మరో ప్రోగ్రామ్ కు సంబంధించిన యాడ్స్ నాలుగు కోట్ల రూపాయల పైనే అని కాగ్ తన నివేదికలో పేర్కొంది.

ఇక ధర్మపోరాట దీక్షకు సంబంధించి యాడ్స్ ఖర్చు మరో మూడు కోట్ల రూపాయల పైనేనట.

రొటీన్ గా ప్రభుత్వం యాడ్స్ ఇస్తూనే ఉంటుంది. వాటిని మినహాయించి.. బాబు సొంత డబ్బా కొట్టుకునేందుకు ఇచ్చిన యాడ్స్ ను మాత్రమే కాగ్ వేరు చేసింది.

వాటి వివరాలను పేర్కొంటూ..జనం సొమ్ముతో చంద్రబాబు ఏ విధంగా సొంత ప్రచారం చేసుకుంటున్నారో వివరించి చెప్పింది.

కాగ్ నివేదికలకు చంద్రబాబు భయపడే రకమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *