“మీ భవిష్యత్తు _నా బాధ్యత” అంటూ ప్రజల ముందుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు!

గత కొన్ని ఎన్నికల నుంచి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం ఈసారి ఒంటరిగా బరిలో దిగి భొతోంది.
మీ భవిష్యత్ _నా బాధ్యత నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ముందుకు వచ్చారు.
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు అనుభవం ,పాలన దక్షతపై భరోసా ఉంచి పట్టం కట్టారు.
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఈ ఐదేళ్లలో ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశారు.
ఆర్థిక వనరుల కొరత వేధిస్తున్న కేంద్రం నుంచి ఆశించిన సహకారం లేకున్నా పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లగలిగారు.
పోలవరం ప్రాజెక్టు 63% పూర్తయినట్లు ప్రభుత్వం ప్రకటించింది, ల్యాండ్ పూలింగ్ విధానంలో రాజధాని కోసం 35 వేల ఎకరాల రైతుల నుంచి స్వచ్ఛందంగా సేకరించింది.
48 వేల కోట్లతో రాజధాని నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. నిధులకు ఇబ్బంది పడుతున్న పెన్షన్లు రెండు వేలకు పెంచడం ద్వారా మహిళలకు రెండు విడతలు గ 20 వేల ఆర్థిక సాయం ,నిరుద్యోగ భృతి 2000 వంటి ప్రజా కర్షక నిర్ణయాలు ప్రకటించారు.
ఇప్పటికే 9 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి కాగా, కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ,వెనుకబడిన వర్గాల విద్యార్థులకు విదేశీ విద్య ,అన్న క్యాంటిన్లు ,చంద్రన్న బీమా, పెళ్ళికానుక, అన్నదాత సుఖీభవ ఇలా గత ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఓట్లు రాల్చుతాయి అన్న ది మా లో ఉంది.
విభజన హామీల అమలు ప్రత్యేక హోదాపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో విసుగు చెంది ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు.
కేంద్రంలోని బలoగల నరేంద్ర మోడీ ప్రభుత్వంతో డి అంటే డి అన్నారు. ఓ వైపు రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తూ,
మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీ ఇతర పార్టీలని కాంగ్రెస్ తో సహా ఏకతాటి పైకి తీసుకొచ్చే బాధ్యత భుజానికెత్తుకున్నారు.
అభ్యర్థుల ప్రకటన లో తెలుగుదేశం దూకుడు ప్రదర్శించింది, తొలి విడతలో 126 మంది, రెండో విడతలో 15 మంది అభ్యర్థులను అసెంబ్లీ స్థానాలకు ప్రకటించింది.
ఎన్నికల ప్రచార శంఖం పూరించారు, గతానికి భిన్నంగా ఆశావహులు నియోజకవర్గాల ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్ధుల్ని ఎంపిక చేశారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామందికి టిక్కెట్లు దకయి, కొందరికి స్థానాలు మారాయి.