టీడీపీకి సెలవు వైయస్సార్సీకి జై …… అంటున్న మోదుగల

త్వరలోనే జగన్‌తో భేటీ.. అయ్యి …వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు..టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మోదుగుల. క్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. ఆమోదించాలని కోరిన మోదుగుల. .

కొంతకాలంగా అధిష్టానం తీరుపై మోదుగుల అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులతో చివరిసారిగా సమావేశం అయినట్లు సమాచారం.పార్టీలో తనను అవమానించారు కన్నీటి పర్యంతం అయ్యారు.

టీడీపీకి గుంటూరు ఎమ్మెల్యే వేణుగోపాల్‌రెడ్డి షాకిచ్చారు. సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా…లేఖల్ని చంద్రబాబుకు, అసెంబ్లీ స్పీకర్‌కు పంపారు. తన వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. ఆమోదించాలని కోరారు.

అంతకుముందు మంగళవారం పార్టీ అధ్యక్షులతో సమావేశమయ్యారు మోదుగల…టీడీపీలో తనకు ఎదురైన అవమానాలను చెప్పుకుని మోదుగుల కన్నీటిపర్యంతమయ్యారట.

తనకు గౌరవం లేని చోట ఉండలేనని.. ఇప్పటి వరకు చంద్రబాబు ఫోన్ చేస్తారేమోనని ఎదురుచూశానన్నారట.

అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తీవ్ర ఆవేదన కు లోనయ్యారు …అందుకే పార్టీ వీడుతున్నట్లు చెప్పారు…

డివిజన్ అధ్యక్షులతో భేటీ తర్వాత.. మోదుగుల వారితో చివరి సారిగా గ్రూప్ ఫోటోలు దిగారు. గుంటూరు నుంచి హైదరాబాద్ బయలుదేరారు.

త్వరలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో వేణుగోపాల్‌రెడ్డి భేటీ అవుతారని సమాచారం.అనంతరం వైసీపీ కండువా కప్పుకోవాలని భావిస్తున్నారట.

మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2009లో టీడీపీ నుంచి నర్సరావుపేట ఎంపీగా గెలిచారు. రాయపాటి సాంబశివరావు రాకతో.. 2014 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

వచ్చే ఎన్నికల్లో మోదుగుల వైసీపీ నుంచి గుంటూరు లేదా నరసరావుపేట ఎంపీగా పోటీచేసే అవకాశం ఉందని ప్రచారం కొనసాగుతుంది.

2014 ఎన్నికల తర్వాత మోదుగుల మంత్రి పదవిని ఆశించినా.. సామాజిక సమీకరణాలతో దక్కలేదు. అప్పటి నుంచి పార్టీ తీరుపై అసంతృప్తితోనే ఉన్నా రు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఎంపీ సీటు ఇవ్వాల‌ని చంద్రబాబును కోరారు.

కొద్దిరోజుల క్రితం ఓ ప్రైవేట్ సమావేశానికి వెళ్లిన మోదుగుల.. సొంత పార్టీపై విమర్శలు చేశారు. ఈ వ్యవహారం చంద్రబాబు దృష్టికి వెళ్లింది.. ఆ తర్వాత పరిణామాలు మారుతూ వచ్చాయి. కొద్ది రోజులుగా వేణుగోపాల్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

తాజాగా చంద్ర బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్దుల ఎంపిక పై స‌మావేశం నిర్వ‌హించగా.. ఆ సమావేశానికి హాజరు కాలేదు మోదుగల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *