చిత్తూరు, విశాఖ జిల్లాల్లో 2288 పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్…

మూడు దశలు కింద దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీకి బ్రాడ్ బాండ్ కనెక్షన్ సదుపాయం కలిగించే ఉద్దేశంతో ప్రారంభించిన భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా ఏపీ లోని చిత్తూర్, విశాఖ జిల్లాలో ఇప్పటివరకు 2288 గ్రామ పంచాయతీలకు బ్రాడ్ బాండ్ సర్వీసును అందిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ సోమవారం రాజ్యసభకు వెల్లడించారు.

విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ రెండు జిల్లాల్లో మిగిలిన 614 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ రెండో దశ కింద బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుందన్నారు.

భారత్ నెట్ ప్రాజెక్టులో మూడు దశల కింద దేశంలోని రెండు లక్షల గ్రామ పంచాయతీలకు 2019 నాటి కల్లా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ సదుపాయం కల్పించాలన్నది లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో 670 కిలోమీటర్లు మేర రహదారులు విస్తీర్ణం కు, 4 లేదా 6 లేన్లుగా విస్తరించే పనులను చేపట్టినట్లు రహదారుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ సోమవారం రాజ్యసభకు తెలిపారు.

విజయ్ సాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ మరో 505 కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణ కోసం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డి పి ఆర్.. రూపకల్పన జరుగుతుందని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో 550 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ జాతీయ రహదారులు, 3459 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయని మంత్రి చెబుతూ పెరిగే ట్రాఫిక్ నిధుల అందుబాటును బట్టి, వీటిని దశలవారీగా విస్తరించడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *