వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అంటున్న బిజెపి ఎమ్మెల్యే

2014 ఎన్నికల్లో-టిడిపి బిజెపి పొత్తులో భాగంగా తనకు కైకలూరు సీటు కేటాయించారని కామినేని శ్రీనివాస్ తెలిపారు.

వెంకయ్య నాయుడు కోరడంతోనే సిట్టింగ్ స్థానాన్ని టిడిపి వదులుకొని తనకు ఇచ్చిందన్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీచేసే ఆశ తనకు లేదని మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. ప్రజా సేవ చేయడానికి సీటు తో పనిలేదని స్పష్టం చేశారు.

విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని తెలిపారు.

2014లో టిడిపి బిజెపి పొత్తులో భాగంగా తనుకు కైకలూరు సీటు కేటాయించారని తెలిపారు ఎమ్మెల్యేగా గెలవడం మంత్రిగా పని చేయడం తనకు పూర్తి సంతృప్తినిచ్చిందని చెప్పారు.

2014లో ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచి పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా కేబినెట్లోకి తీసుకున్నారు.

శ్రీనివాస్ పనితీరుపై చంద్రబాబు ఎన్నోసార్లు ప్రశంసల వర్షం కురిపించారు.

మారిన పరిస్థితుల ప్రభావం వల్ల టిడిపి బిజెపి పొత్తుకు బీటలు రావడంతో మరో మంత్రి మాణిక్యాలరావు తో కలిసి ఆయన పదవికి రాజీనామా చేశారు.

అయితే ఇతర బీజేపీ నేతల ఎప్పుడు సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయలేదు..

దీంతో కామినేని టీడీపీలో చేరానన్నారు అంటూ కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.

ప్రస్తుతం ఏపీ లో బిజెపి కి గడ్డు పరిస్థితి ఉందని పేర్కొన్నారు. టిడిపి నేతల విమర్శలను తిప్పి కొట్టడం తో రాష్ట్ర నేతలు విఫలం అవుతున్నారు.

దీంతో ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒక్క సీట్ అయినా గెలుచుకుంటుందని ప్రశ్నించారు.

ఈ క్రమంలో కొందరు బీజేపీ నేతలు సైకిల్ ఎక్కడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన కామినేని ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సుముఖంగా లేరని, అలాగని బిజెపి తరఫున పోటీ చేసి తన పరువును పోగొట్టుకోవాలని కూడా అనుకోవట్లేదని ఆయన స్నేహితులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *