టీడీపీ టికెట్ ఆశిస్తున్న….బిగ్ బాస్’ కౌశల్..

బిగ్ బాస్’ టీవీ రియాలిటీ షో ద్వారా గుర్తింపు సాధించిన కౌశల్ ఇప్పుడు రాజకీయాల వైపు మొగ్గుచూపుతున్నారు…! కులం కోటాలో కౌశల్ ఎన్నికల్లో పోటీచేయాలని అనుకున్నాడు…. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు..

అనకాపల్లి నుంచి కౌశల్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలే ధ్రువీకరిస్తూ ఉన్నాయి.

వివిధ సమీకరణాల నేపథ్యంలో అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ను కాపు సామాజికవర్గానికి కేటాయించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. అందుకోసం పలువురు నేతల పేర్లను పరిగణనలోకి తీసుకుంటున్నారని సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో.. బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ఆ టికెట్ ను ఆశిస్తున్నారట. కాపు కోటాలో ఆ టికెట్ కోరుతున్నారట. మరి కొందరు కాపు సామాజికవర్గం నేతలు కూడా కౌశల్ కు పోటీలో ఉన్నారట! మరి ‘బిగ్ బాస్’ గుర్తింపుతో కౌశల్ కు తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రాధాన్యతను ఇస్తుందా? లేదో వేచి చూడాలి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *