భాగ్యనగరంలో 40 ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్ రోడ్లపై మరో రెండు రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి.
ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు గ్రేటర్లో దశలవారీగా ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చేలా టీఎస్‌ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది.
40 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించే దిశగా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే నగరంలో ట్రయల్ రన్ ప్రారంభించిన అధికారులు ఎలక్ట్రిక్ బస్సుల పనితీరును పూర్తిస్థాయిలో పరిశీలించారు.
గ్రేటర్లో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2019 చివరి నాటికి 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
అద్దె ప్రాతిపదికన మొదట ఎలక్ట్రిక్ బస్సులను నగరంలో నడుపుతోంది. ఏసీ బస్సుల చార్జీలనే ఎలక్ట్రిక్ బస్సుల్లో అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్న ఆర్టీసీ వాటికి తగినట్లుగా చార్జింగ్ స్టేషన్లు సిద్ధం చేసింది.
మియాపూర్ -2 డిపో, కంటోన్మెంట్ డిపోలో చార్జింగ్ స్టేషన్లను చార్జ్ చేశారు. ఒక్క డిపోలో 10-12 బస్సులకు ఒకేసారి చార్జింగ్ చేసుకునేలా చార్జింగ్ పాయింట్లు సిద్ధం చేశారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ ్టలోనూ ప్రత్యేకంగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రికల్ బస్సుకు 4గంటలు చార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్లు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు.