రాష్ట్రపతిని కలిసిన బాబు.. ఏపీకి న్యాయం చేయాలని వినతి

ధర్మపోరాటాన్ని బీజేపీ, వైసీపీలే విమర్శిస్తున్నాయని, అవి మినహా అన్ని పార్టీల మద్దతు ఏపీకే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా కోసం దివ్యాంగుడు అర్జున్‌రావు ఆత్మహత్య చాలా బాధాకరమని చంద్రబాబు వ్యక్తం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై రాష్ట్రపతికి చంద్రబాబు వినతి పత్రం సమర్పించారు.ఆర్థికంగా నష్టపోయిన ఏపీని ఆదుకోవాలని మనవి చేసిన బాబు.
బీజేపీ, వైసీపీ మినహా అన్ని పార్టీల మద్దతు ఏపీకేనంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని పేర్కొన్న అంశాలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు వినతి పత్రం అందజేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతిని ఆయన కోరారు. అంతకు ముందు ముఖ్యమంత్రితో సహా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక హోదా సాధనా సమితి, ప్రజా, ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ భవన్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు.

అంతకు ముందు పాదయాత్రగా బయలుదేరిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో ఉండి మొత్తం కష్టాన్ని వదిలిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాం.. అందరం తెలివిగా కష్టపడి, వినూత్నంగా పనిచేసినా, కేంద్రం సహకరిస్తే మిగతా రాష్ట్రాల స్థాయి కి వెళ్లాలంటే కనీసం 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది.

వాళ్లు ఇంకా బాగా చేసే వారిని అందుకోవడం కష్టం.. అలాంటి పరిస్థితుల్లోనూ కేంద్రం ఎంతో బాధ్యతారాహిత్యంగా, దుర్మార్గంతో ప్రవర్తించింది.

మన జీవితాలతో ఆడుకుంటున్నారు. దీనికి నిరసనగా ఢిల్లీ వీధుల్లో పాదయాత్ర చేపట్టాం.. దీన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని’ చంద్రబాబు హెచ్చరించారు.

ఢిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్ష ప్లాప్ అనడం రాష్ట్ర ద్రోహమని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ 17 పార్టీల ప్రతినిధులు పాల్గొనడం ప్లాప్ షో నా..? లేక దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టడం ప్లాప్ షో నా..? అని సీఎం నిలదీశారు.

ధర్మపోరాటాన్ని బీజేపీ, వైసీపీలే విమర్శిస్తున్నాయని, అవి మినహా అన్ని పార్టీల మద్దతు ఏపీకేని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా కోసం దివ్యాంగుడు అర్జున్‌రావు ఆత్మహత్య చాలా బాధాకరమని, ఎవరూ ఇలాంటి సాహసానికి పూనుకోవద్దని హితవు పలికారు.

ఢిల్లీలో రాబోయేది ఏపీకి హోదా ఇచ్చే ప్రభుత్వమేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed