చినరాజప్ప పై బాబు గురి.

హోం మంత్రి చినరాజప్ప మృదుస్వభావి అని, కాంట్రవర్సీలు జోలికి అసలు పోరు ,పార్టీకి చాలా విధేయుడై ఉంటారు అని చెప్పసాగారు. అందుకే ఆయనను ఉప ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారు చంద్రబాబు.
కానీ ఆయన అంటే చిన్న బాబు లోకేష్ కు ఎందుకు నాకు పెద్దగా ఇష్టం లేనట్లుగా ఆరంభంలోనే రూమర్లు వచ్చేసాయి. కొన్ని రోజుల తర్వాత ఇలాంటివి ఏమీ వినిపించలేదు మరి.
అయితే ఇప్పుడు మంత్రి చినరాజప్ప పై ముఖ్యమంత్రి చంద్రబాబు గురిపెట్టారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో ఆయనపై ఎటువంటి కోపం లేదని, ఆ జిల్లాల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా అని టాక్.
విషయానికొస్తే, ఈస్ట్ గోదావరి లో కాపు ప్రజా ప్రతినిధులు కాస్త చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. వీళ్లలో సీనియర్లు కూడా ఎక్కువే. కానీ ఎంత మందికి మంత్రి పదవులు ఇవ్వగలరు చెప్పండి.

దాంతో కేవలం చిన్న రాజప్ప ను దరి చేర్చుకోవడం వల్ల మిగిలిన వారిలో కనిపించని అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇలా అసంతృప్తి పెరిగే కొందరు జంప్ చేస్తారేమో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
మరోవైపు అదే జిల్లాలో కాపులకు పోటీగా కమ్మ సామాజిక వర్గం కూడా ఉంది. కానీ ఈక్వేషన్లు రీత్యా వీళ్లకు సరైన విధంగా టిక్కెట్లు ఇవ్వడం కుదరడం లేదు.
కానీ ఈసారి పరిస్థితి చూస్తుంటే కాపులు కాస్త గట్టిగానే పెట్టుకునేలా ఉన్నారు.
వైకాపా కాపుల పట్ల నిబద్ధత ప్రదేశ్ ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తోంది. అందువల్ల అదే పరిస్థితి టిడిపికి తప్పదు.
ఇలాంటి నేపథ్యంలో బహుళార్థక రాజకీయ ప్రయోజన సాధక పథకానికి బాబు తెరవెనుక శ్రీకారం చుట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
చినరాజప్ప పై సరైన అభ్యర్థిని జనసేన ద్వారా పోటీకి నిలిపి, ఆయనను కట్ చేయగలిగితే, పదవులు ఆశిస్తూ, జమ చేస్తామని అంటున్న వారిని బుజ్జగించి, తరువాత అవకాశం కల్పించవచ్చు.
చినరాజప్ప పై గెలిస్తే మళ్లీ వారికి అవకాశం ఇవ్వక తప్పదు. అలా అని టికెట్ ఇవ్వకుండా ఉండలేదు.
అందుకే గతంలో చిన్న రాజప్ప కు బదులుగా టికెట్ ఆఖరి నిమిషంలో చేజారిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి జనసేన తీర్థం ఇప్పించి, అక్కడ పోటీకి నిలబెట్టాలనే వ్యూహాన్నికి శ్రీకారం చుట్టారని వినిపిస్తోంది.
జనసేన కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి టిక్కెట్ ఇచ్చిన సమస్య రాదు. అదే టిడిపి అయితే కాపులకు అన్యాయం చేసిందిన్న అపవాదం వస్తుంది.
పైగా వేరే పార్టీలలో టిక్కెట్లు ఇప్పించడం, తమ వారి పైన తను అనుకున్న వారిని ఇండిపెండెంట్లుగా నిలపడం ఇలాంటివన్నీ బాబుకు అలవాటైన పనులే కదా..
ఇలా చేయడం వల్ల ఇద్దరు కాపు అభ్యర్థులతో ఢీకొని కమ్మ సామాజిక వర్గం అభ్యర్థి గెలవడం, ఆ వర్గానికి ఓ సీటు పెరగటం, చినరాజప్ప స్థానంలో తోట త్రిమూర్తులు లేదా ఇంకా మిగిలిన వారికి అవకాశం ఇవ్వటం, ముఖ్యంగా లోకేష్ కు అభిమాన పాత్రుడిగా ఉన్న కళా వెంకటరావు లాంటి వాళ్లకు మంచి పదవి ఇవ్వటం ఇలాంటి వ్యవహారాలు సాధ్యమవుతాయి.
ఈస్టులో ఇలాంటి చమక్కులు చాలావాటికి బాబు తన లౌక్యం తో వ్యూహరచన చేస్తున్నారని ఆ జిల్లా రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది.
కృష్ణ, గుంటూరు తమకు అనుకూలంగా ఉంటాయని భావిస్తోంది. వాటి తరువాత ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది ఈస్ట్ మీదే అని భావిస్తోంది.
పైగా జనసేనకు కాస్త ఆదరణ ఉండే జిల్లాల్లో ఇది ఒక్కటి కూడా..
అందుకే తెరవెనుక అందాలతో అక్కడ సరైన వ్యూహం రచించే పనిమీద బాబు బిజీ గా ఉన్నారని టాక్.
ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగానే ఉన్నాయి.. కానీ పెద్దాపురం నియోజకవర్గాన్ని చాలా శ్రద్ధగా అభివృద్ధి చేశారు చిన్నరాజప్ప అని టాక్.
మళ్లీ జనం చినరాజప్పకు … బ్రహ్మరథం పడితే ఈ వ్యూహాలను గల్లంతే పోతాయేమో…?