బాబు గుండెలో గుబులు: నెల్లూరులో బుజ్జగింపులు

జగన్ సమర శంఖారావం సభల షెడ్యూల్ చూసుకుని చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారు. జగన్ ఏ జిల్లాకు వెళ్తున్నారో ముందుగా తెలుసుకుని ఆ జిల్లా అసంతృప్తులను బుజ్జగించే పనులు మొదలుపెడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు నెల్లూరుపై బాబు దృష్టిపడింది.

ఈనెల 19న నెల్లూరులో జగన్ సభకు భారీఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీకి ఎక్కువ మెజార్టీ వచ్చిన జిల్లాల్లో నెల్లూరు ఒకటి.

పదింట ఏకంగా ఏడు స్థానాలు వైసీపీ గెలుచుకుంది. రెండు పార్లమెంట్ స్థానాలూ వైసీపీకే దక్కాయి.

ఎమ్మెల్యేల్లో ఒకరు అమ్ముడుపోయినా ఆరుగురు జగన్ వెంటే నిలిచారు. ఈదఫా జిల్లాలో పదికి పదిస్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇటీవలే చంద్రబాబు జిల్లాలో కొన్ని అసెంబ్లీ స్థానాలు ఖరారు చేయడంతో అసంతృప్తులంతా రగిలిపోతున్నారు.

వాళ్లంతా సమర శంఖారావం సాక్షిగా వెళ్లి వైసీపీలో చేరుతారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది.

మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ టికేట్ఆశించి భంగపడ్డ ఆనం జయకుమార్ రెడ్డి, సిటీ టికెట్ విషయంలో మంత్రి నారాయణ చేతిలో అవమానం పొందిన నగర మేయర్ అజీజ్, కోవూరు విషయంలో అలకబూనిన శ్రీనివాసుల రెడ్డి.. ఈ ముగ్గురూ వైసీపీలో చేరతారనే ప్రచారం ఉంది.

దీంతో ఈ ముగ్గురినీ చంద్రబాబు అమరావతి పిలిపించుకుని మంతనాలు సాగిస్తున్నారు.

వాళ్లకు కల్లబొల్లి మాటలు చెప్పి తాయిలాలు ఇచ్చే కార్యక్రమం షురూచేశారు. కానీ బాబు బుజ్జగింపులు నెరవేరడం లేదనే విషయం ఇప్పటికే స్పష్టమైంది.

నేతలంతా వైసీపీ వైపు క్యూ కడుతున్నారు. పైన చెప్పుకున్న ముగ్గురు కూడా జగన్ పార్టీలోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

అదే కనుక జరిగితే ఈసారి బాబుకు నెల్లూరు జిల్లా నుంచి ఫుల్ టైం బాయ్ కాట్ తప్పకపోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *