తనను తాను నిప్పు అని చంద్రబాబు చెప్పుకోవడం తప్ప, ఏ పూట ఏం మాట్లాడతారో ఆయనక్కూడా తెలియదు

ఏ పూట ఏ మాట్లాడతారో ఆయనక్కూడా తెలియదు . ఇలాంటి నాయకుడ్ని మనం సమీప భవిష్యత్తులో చూడగలమా? అనిపించేంతటి ప్రత్యేకత ఆయన సొంతం. నారా చంద్రబాబు నాయుడు.

తనను తాను నిప్పు అని చంద్రబాబు చెప్పుకోవడం తప్ప, నిఖార్సయిన రాజకీయాలు చేయడం ఆయనకి తెలియదు గాక తెలియదు.

తాజాగా నల్ల షర్ట్ ధరించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో హల్ చల్ చేసిన చంద్రబాబు, అ నల్ల ప్రభావం వల్లనేనేమో ఇదివరకెన్నడూ లేనంత ఆగ్రహావేశాలు లోనయ్యారు.

అదీ పాత మిత్రుడు, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మీద. కేంద్ర ప్రభుత్వం తరపున తాము ఆంధ్రప్రదేశ్ కి ఏమేం చెయ్యదలచుకున్నామో విష్ణుకుమార్ రాజు చేసిన నేరంగా మారింది.

చంద్రబాబుకి విష్ణుకుమార్ రాజు మాటలు రుచించలేదు. అంతమాత్రాన, రంకెలేస్తామంటే ఎలా? ముఖ్యమంత్రికి సభలో అందరూ గౌరవమివ్వాలి…. అదే సమయంలో ఆయన సభను గౌరవించాలి.

ఆ అసెంబ్లీ లో వున్నానను విషయాన్నీ , తాను ముఖ్యమంత్రినన్న విషయాన్నీ చంద్రబాబు మర్చిపోయారు.

అటు వైపున్నది ఓ పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తోన్న శాసనసభ పక్ష నేత అన్న విషయాన్ని చంద్రబాబు పక్కన పెట్టేశారు. పరిస్థితిని టీవీల్లో లైవ్ చూస్తున్నావారు ఒకింత షాక్ కి గురయ్యారు.

బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు తాను చెప్పదలుచుకున్నది చెప్పారు… దానికి కౌంటర్ ఇచ్చేందుకు టీడీపీకి ఎలాగూ మెజార్టీ సమయం దక్కుతుంది.సభలో వున్నవే రెండు పార్టీలు అందులోనూ సంఖ్యా బలం టీడీపీకి ఎక్కువ.

అధికారంలో వున్నది టిడిపి గనుక, ఆ పార్టీ కోరుకున్న సమయం దొరుకుతుంది. మరెందుకు చంద్రబాబు అసహనానికి గురయ్యారట? అసెంబ్లీలో చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలిన్నారు, ఆ ప్రత్యేక హోదా దండగా అని కూడా చెప్పారు. ఇక్కడే ప్రధాని నరేంద్ర మోడీని అభినందిస్తూ తీర్మానం చేశారు.

ఇక్కడే చంద్రబాబు నరేంద్ర మోడీ ని తూలంనాడుతున్నారు. అఫ్ కోర్స్ విష్ణుకుమార్ రాజు కూడా నిన్న మొన్నటి దాకా చంద్రబాబు భజనలో మునిగి తేలేరనుకోండి…. అది వేరే విషయం.

అయితే జగన్ ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక హోదా కోసం పోరాడదామని , రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రాణప్రదమని చెప్పినంత సేపూ చంద్రబాబునాయుడు అందుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. హోదాతో ఏమీ రాదు అని అన్నాడు. హోదా రాకపోవడం వల్ల నష్టంలేదన్నాడు హోదా సంజీవిని కాదన్నాడు. హోదావద్దే వద్దన్నాడు. హోదాకు మించిన ప్యాకేజీ అన్నాడు, హోదా అంటే జైలుకే అని కూడా హెచ్చరించాడు.

అప్పుడంతా చంద్రబాబునాయుడుకు మోడీ తో స్నేహం ముఖ్యం. కేంద్రంతో సఖ్యత ముఖ్యం. మోడీ మహానుభావుడు, కేంద్రం అద్భుతంగా సాయం చేస్తోంది, కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా పెట్టాడు ఇదే చంద్రబాబు నాయుడు.

ఇప్పుడు మాత్రం జగన్ అప్పుడు ఏం మాట్లాడాడో.. అదే మాట్లాడుతూ ఉన్నాడు. మాటెత్తితే తనది నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటాడు.

జగన్ కు పంచాయతీ ప్రెసిడెంట్ అనుభవం కూడా లేదని ఎద్దేవాచేస్తూ ఉంటాడు. తీరా విధానాల్లో మాత్రం జగన్ ను కాపీకొట్టడమె సరిపోతోంది చంద్రబాబు కు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *