వేడుకలకు దూరంగా, కరోనా బాధితులకు అండగా… జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితులను కాపాడేందుకు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేస్తున్న NRI జనసేన శ్రేణులు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పార్టీ నేతలు, కార్యకర్తలపై ప్రశంసలు కురిపించారు.
ఏ పని చేసినా మనసు పూర్తిగా చేయాలి..నా అభిమానులు అంతా నా పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా చేయాలని అనుకుంటున్నారు కానీ నేన్ను అభిమానించే జనాల్లో చాలామందికి ఇప్పటికే కరోనా సోకింది, అందులో కోలుకున్న వారు కొందరు ఉన్నారు, కోలుకోలేని వారు కూడా ఉన్నారు …
ఈసారి నేను నా పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు నిర్వహించుకుండా రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితులకు కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు.
పవన్ పిలుపును అందుకున్న జనసైనికులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సిలిండర్లకు విరాళాలు అందజేస్తున్నారు. వీరు మాత్రమే కాదు.. ఎన్‌ఆర్‌ఐలు, విదేశాల్లో ఉన్న జనసైనికులు, ఫ్యాన్స్ కూడా తమ వంతుగా సాయం అందిస్తున్నారు.
ఇలా కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నవారికి పవన్ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా పేర్లను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.

ఆ పేర్లను ఎప్పటికప్పుడు ట్వీట్ చేస్తున్నారు. కరోనా వంటి కష్టకాలంలో బర్త్ డే సందర్భంగా వేడుకలు నిర్వహించొద్దని పవన్ కోరారు. ఆ డబ్బను కరోనా బాధితుల కోసం ఖర్చు చేయాలని కోరారు.