అవార్డులు కొల్లగొట్టిన ‘మహానటి’ ఉత్తమ నటుడిగా బాలకృష్ణ ఎంపిక…ఉత్తమ హీరోగా రామ్‌చరణ్‌ను ఎంపిక

 • 1.2017, 2018కిగానూ టీఎస్సాఆర్ జాతీయ అవార్డులను ప్రకటించారు.
 • 2.మహానటి చిత్రం ఆరు అవార్డులను సొంతం చేసుకుంది.
 • 3.ఫిబ్రవరి 17న అవార్డుల బహుకరణ కార్యక్రమం ఉంటుంది.

టి.సుబ్బరామిరెడ్డి అందజేసే టీఎస్సార్‌ జాతీయ అవార్డులను ప్రకటించారు. 2017కు గానూ ఉత్తమ నటుడిగా బాలకృష్ణ ఎంపిక కాగా, 2018లో ఉత్తమ హీరోగా రామ్‌చరణ్‌ను ఎంపిక చేశారు. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ ఉత్తమ చిత్రం సహా ఆరు అవార్డులకు ఎంపికైంది.

ఫిబ్రవరి 17న విశాఖపట్నంలో అవార్డుల బహూకరణ కార్యక్రమం ఉంటుందని జ్యూరీ ఛైర్మన్‌ సుబ్బరామిరెడ్డి తెలిపారు. 2017లో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా మెగాస్టార్ నటించిన ఖైదీ నంబర్ 150 నిలవగా.. మరుసటి ఏడాది ఆయన కుమారుడు నటించిన రంగస్థలం నిలవడం విశేషం.

రారండోయ్ వేడుక చేద్దాం సినిమాలో నటనకు గానూ రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తమ నటిగా ఎంపికైంది. మరుసటి ఏడాది ఉత్తమ నటిగా ‘మహానటి’ కీర్తి సురేశ్‌ను ఎంపిక చేశారు.

2017 అవార్డులు:

 • ఉత్తమ నటుడు – బాలకృష్ణ (గౌతమీపుత్ర శాతకర్ణి)
 • ఉత్తమ నటి – రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (రారండోయ్‌ వేడుక చూద్దాం)
 • ఉత్తమ హీరోయిన్‌ – రాశీఖన్నా
 • ఉత్తమ హీరోయిన్‌ (పరిచయం) – షాలినీ పాండే (అర్జున్‌రెడ్డి)
 • ఉత్తమ చిత్రం – గౌతమీపుత్ర శాతకర్ణి
 • అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం – ఖైదీ నంబరు 150
 • బెస్ట్ డైరెక్టర్ – క్రిష్‌ (గౌతమీపుత్ర శాతకర్ణి)
 • మోస్ట్ పాపులర్ డైరెక్టర్ – వి.వి.వినాయక్‌ (ఖైదీ నంబర్ 150)
 • ఉత్తమ సహాయ నటుడు – ఆది పినిశెట్టి (నిన్నుకోరి)
 • బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీ ప్రసాద్‌ (ఖైదీ నంబర్ 150)
 • ఉత్తమ సింగర్ (మేల్ – దేవిశ్రీ ప్రసాద్‌ (అమ్మడు.. లెట్స్‌ డు కుమ్ముడు)
 • బెస్ట్ సింగర్ (ఫిమేల్) – మధు ప్రియ (ఫిదా)
 • స్పెషల్‌ జ్యూరీ – రాజశేఖర్‌ (గరుడవేగ)
 • స్పెషల్‌ జ్యూరీ- సుమంత్‌ (మళ్లీరావా)
 • స్పెషల్ జ్యూరీ -అఖిల్‌(హలో)
 • స్పెషల్‌ జ్యూరీ సహాయ నటుడు – నరేష్‌ వి.కె.(శతమానం భవతి)
 • స్పెషల్ జ్యూరీ – రితికా సింగ్‌(గురు)
 • స్పెషల్ జ్యూరీ ఫిల్మ్‌- (ఫిదా: దిల్‌రాజు, శిరీష్‌)

2018 అవార్డులు:

 • ఉత్తమ నటుడు – నాగార్జున (దేవదాస్‌)
 • ఉత్తమ హీరో – రామ్‌చరణ్‌
 • ఉత్తమ హీరో (పరిచయం) – కల్యాణ్‌దేవ్‌(విజేత)
 • ఉత్తమ చిత్రం – మహానటి
 • బెస్ట్ డైరెక్టర్ – నాగ్‌ అశ్విన్‌ (మహానటి)
 • ఉత్తమ నటి – కీర్తి సురేష్‌ (మహానటి)
 • ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం – రంగస్థలం
 • ఉత్తమ నటి (పరిచయం) – ప్రియాంక జవాల్కర్‌(ట్యాక్సీవాలా)
 • ఉత్తమ సహాయనటుడు – రాజేంద్ర ప్రసాద్‌(మహానటి)
 • ఉత్తమ బాలనటి – సాయి తేజస్వీ
 • ఉత్తమ గాయని – గంటా వెంకటలక్ష్మి (రంగస్థలం)
 • ఉత్తమ హీరోయిన్‌ – పూజా హెగ్డే
 • మోస్ట్‌ పాపులర్‌ డైరెక్టర్‌ -సుకుమార్
 • బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – తమన్‌ (అరవింద సమేత)
 • స్పెషల్‌ జ్యూరీ – సుప్రియ (గూఢచారి)
 • ఉత్తమ కమెడియన్ – అలీ
 • ఉత్తమ దర్శకుడు (పరిచయం) – వెంకీ అట్లూరి(తొలి ప్రేమ)
 • స్పెషల్‌ జ్యూరీ – బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ (జయ జానకీ నాయక) స్పెషల్‌ జ్యూరీ – నాగ చైతన్య (శైలజారెడ్డి అల్లుడు)
 • స్పెషల్ జ్యూరీ – కల్యాణ్‌రామ్‌ (నా నువ్వే )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *