వైసీపీలోకి అవంతి శ్రీనివాసరావు

ఊహించిందే జరిగింది టిడిపి నుండి అనకాపల్లి ఎంపీగా గెలిచిన అవంతి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు, వైసీపీ అధినేత ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రం మధ్య వివాదానికి గల కారణాలను అవంతి శ్రీనివాస్ బయట పెట్టారు.
ఏపీ ప్రభుత్వం అవినీతి కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని స్పష్టం చేశారు.
అవంతి శ్రీనివాసరావు తన ఎంపీ పదవికి, టిడిపికి రాజీనామా చేశారు.
ఆ తర్వాత లోటస్పాండ్లోని జగన్ మోహన్ రెడ్డిని కలిశారు, అంతకుముందు వైసిపి సీనియర్ నేత బొత్స నివాసం లో విజయసాయిరెడ్డి, ఆ మంచి తో సుదీర్ఘ మంతనాలు జరిపారు.
మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసిపి లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని వారికి ఎకామిడేషన్ ఇవ్వమని అవంతి కోరారు.
అయితే ముందుగా పార్టీలో చేరాలని వారి సంగతి విశాఖ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైసీపీ నేతలు తెలియపరిచారు.
ఆ తర్వాత జగన్తో భేటీ అయ్యారు, దీని ద్వారా తన సీటు కోసం పార్టీలోకి రాలేదని ముఖ్యమంత్రి వ్యవహారశైలి నచ్చలేదని, వివరించారు అవినీతి బంధుప్రీతి ,కులాలవారీగా వంటివి చేస్తున్నారని విమర్శించారు.
టిడిపి నుండి తనతో వైసీపీలోకి వలసలు ఆరంభం అయ్యాయి అని త్వరలోనే మరిన్ని చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి ఎన్నో యూటర్న్ తీసుకున్నారని ,జగన్ మొదటి నుండి ఒకే మాట మీద నిలబడ్డారని ప్రశంసించారు.
గతంలో వైఎస్సార్ మీద ఇదే రకంగా రూమర్లు సృష్టించారని అవంతి అన్నారు.
ఇప్పుడు జగన్ మీద అలాగే, వ్యవహరిస్తున్నారని ఆరోపించారు, జగన్ కు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మోడీ మధ్య దూరం పెరగడానికి కారణం అవినీతి అని అవంతి స్పష్టం చేశారు.
ఏపీ లో జరుగుతున్న అవినీతి కారణంగానే కేంద్రం ఏపీకి పనిచేయడం మానేసింది అని వివరించారు.