ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట?

అమెజాన్ ఆదాయం చూసి ముచ్చటపడ్డ టాలీవుడ్ కు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి.

నెలరోజుల్లో అమెజాన్ లోకి సినిమా వచ్చేస్తుంది అన్న విషయం పల్లెల వరకు పాకిపోయింది.

దాని ఎఫెక్ట్ భయంకరంగా పడుతోంది. ఈ ఎఫెక్ట్ ఊహించే కదా, అమెజాన్ సంస్థ నిర్మాతలకు కోట్లకు కోట్లు చెల్లిస్తోంది.

భారీ సినిమాలు, అది కూడా క్రేజ్ వున్న పెద్ద హీరోల సినిమాలు అయితే నలభై అయిదు రోజులు, మిగిలిన సినిమాలు 30 రోజులకు అమెజాన్ లో ఫ్రత్యక్షం అయిపోతున్నాయి.

ఈ విషయంలో అస్సలు మొహమాటం లేదు. దీంతో సినిమాకు ఫ్యామిలీల రాక రాను రాను తగ్గుతోంది.

సినిమా సూపర్ అంటేనే జనం వస్తున్నారు. లేదూ అంటే అమెజాన్ లో చూసుకుంటాం అంటున్నారు.

అందుకే టాలీవుడ్ నిర్మాతలు అందరూ కలిసి అమెజాన్ కు ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

అదేంటీ అంటే, అమెజాన్ కు సినిమా అమ్ముతాం, 30 రోజుల్లో వేసుకోండి.

కానీ, థియేటర్ లో సినిమా వేసేటపుడు, ప్రారంభంలోనే డిజిటల్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ అనే టైటిల్ కార్డు వేయకుండా వుంటాము అని నిర్మాతలు అమెజాన్ ను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారట.

అలా అయితే ఈ సినిమా అమెజాన్ లో వస్తుందో? రాదో తెలియక జనం థియేటర్ కు వస్తారని ఓ చిన్న దింపుడు కళ్లం లాంటి ఆశ అన్నమాట.

మరి అమెజాన్ ఈ విన్నపానికి ఓకె అంటుందో, అనదో తెలియాల్సి వుంది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జీ 5, జెమిని, ఆదిత్య ఇలా డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు పెరుగుతున్నాయి.

భవిష్యత్ లో థియేటర్లకు కష్టకాలమే. ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *