పోటీ చేయడానికి భయపడుతున్నారు….టీడీపీ పరిస్థితి ఇప్పుడు రివర్స్ అవుతున్నట్టుగా ఉంది

మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీలకు తిరుగులేదు అనే పరిస్థితి. ఆ మధ్య టైమ్స్ నౌ, రిపబ్లిక్ వంటి టీవీ చానళ్లు ఏపీలో తెలుగుదేశం పార్టీ గట్టిగా ఐదారు ఎంపీ సీట్లను కూడా నెగ్గే పరిస్థితి లేదు అని సర్వేలు ఇస్తే చాలా మంది చానళ్ల తీరును ఖండించారు. ఆ సర్వేలను తప్పు పట్టారు.

ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎంపీ సీట్ల విషయంలో తిరుగు లేదు అని అన్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గడానికి రెడీగా ఉన్న ఆ ఇరవై మంది ఎంపీల పేర్లేమిటో చెప్పాలని చాలా మంది ప్రశ్నించేశారు కూడా. అయితే.. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అలాంటి వాదనలకు చెక్ పడుతూ వస్తోంది.

తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు. వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు.

వారు మాత్రమే కాదు.. మరి కొందరు ఎంపీలు కూడా ఇదే బాటలో పయనిస్తూ ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

వెళ్లే వాళ్లు వెళ్లిపోతూ ఉండగా…. తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థులు అనుకున్న నేతలు కూడా ఇప్పుడు రూటు మారుస్తున్నారు.

వీరిలో కొందరు ఎన్నికల్లో పోటీకి నో చెబుతున్నారట. ఆ జాబితాలో అనంతపురం క్యాండిడేట్ అనుకున్న జేసీ పవన్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది.

అనంతపురం నుంచి పవన్ ఎంపీగా పోటీ చేయాలని అనుకోవడం లేదట. ఎమ్మెల్యేగా అయితే ఓకేనట.

ఇక మరోవైపు ఒంగోలు క్యాండిడేట్ అనుకున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా తెలుగుదేశాన్ని

వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నెల్లూరులో కూడా టీడీపీకి ఇప్పటి వరకూ ఎంపీ క్యాండిడేట్ లేనట్టే.

కర్నూలులో ఒక నేతను తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. నంద్యాల సీటుకు మళ్లీ అభ్యర్థిని వెదుక్కోవాల్సిందే!

గత ఎన్నికల్లో నెగ్గిన వారు, ఫిరాయించిన వారితో తిరుగులేదు అనుకున్న టీడీపీ పరిస్థితి ఇప్పుడు రివర్స్ అవుతున్నట్టుగా ఉంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *