జనసేనలో ఉన్నవారందరూ విలువలు పాటించేవారేనా.. అది పవన్ కల్యాణ్ కే?

ఇన్నాళ్లూ గుండెనిబ్బరంతో ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నారు. పవన్ లో అసంతృప్తి.. ఇప్పుడది పైకి కనిపిస్తోంది తనకిలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించుకుంటూనే బహిరంగ వేదికలపై తన శక్తిసామర్థ్యాలను బేరీజు వేసుకుంటున్నారు.

ముఖ్యంగా జనసేనలోకి వలసలు లేకపోవడంతో పవన్ బాగా డిసప్పాయింట్ అయ్యారని సమాచారం.

చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు వలసలు ఓ రేంజ్ లో ఉన్నాయి, అలాంటిది పవన్ జనసేనకు మాత్రం ఎవరూ పోటెత్తడం లేదు. కనీసం సెకండ్ గ్రేడ్ నాయకులు కూడా రాలేదు.

ఒకరిద్దరు మినహా మిగతా వాళ్లంతా కొత్త ముఖాలే. పక్క పార్టీల్లో కార్యకర్తలుగా ఉన్నవారు కూడా జనసేనలో జిల్లాస్థాయి కమిటీల్లో మెంబర్లుగా ఉన్నారు.

కొత్తరక్తం, కొత్త రక్తం అని చెబుతూ వస్తున్న పవన్ కల్యాణ్ కి కూడా ఈ కొత్త రక్తంపై ఏమంత సంతృప్తి లేదని తెలుస్తోంది. వలసలు లేకపోవడంతో పవన్ కల్యాణ్ దిగాలుపడ్డారు.

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ పక్కపార్టీల నుంచి జనం పొలోమంటూ వచ్చేస్తారని పవన్ ఆశించారు. కానీ అది అడియాశే అయింది.

తాజా మాజీమంత్రి రావెల కిషోర్ బాబు, నాదెండ్ల మనోహర్ మినగా బ్యాచ్ లో ఎవరకీ పెద్ద స్కోప్ లేదు.

జనసేనపై ఎవరికీ నమ్మకం లేకపోవడం, పవన్ కల్యాణ్ ని తక్కువగా అంచనా వేయడంతోనే వలసలు లేని పార్టీగా మారిపోయింది జనసేన.

అయితే పవన్ మాత్రం ఎన్నికలు సమీపించే కొద్దీ వలసలు పెరుగుతాయని ఆశించారు. రావెల చేరిన సయంలో ఇక అందరూ టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చేస్తారని చంకలుగుద్దుకున్నారు.

కానీ పవన్ వేచి చూస్తున్నా ఎవరిలో కదలిక లేదు. ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు జనసేనానితో భేటీ అయినా.. అంతిమంగా వారి ఛాయిస్ వైసీపీయేనని అర్థమైంది.

కనీసం సొంత సామాజిక వర్గానికి చెందినవారు కూడా జనసేనానితో కలసి నడిచేందుకు భయపడుతున్నారు.

ఎవరూ రావడంలేదని తేలాక పవన్ కల్యాణ్ బోల్డ్ స్టేట్ మెంట్ లు ఇస్తున్నారు. బలమైన విలువలు పాటించగలమా లేదా అన్న భయంతో నాయకులెవరూ జనసేనలో చేరడంలేదని సెలవిచ్చారు.

చిత్తూరు మీటింగ్ ల్లో పదే పదే జనసేన వలసలపై ప్రసంగించారు.

పవన్ మాట ప్రకారం విలువలు పాటించలేకే ఇతర పార్టీ నేతలు జనసేనలో చేరడంలేదు, మరి జనసేనలో ఉన్నవారందరూ విలువలు పాటించేవారేనా.. అది పవన్ కల్యాణ్ కే తెలియాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *