కరోనా మహమ్మారిపై, రాష్ట్రంలోని ప్రముఖ వైద్యులతో చంద్రబాబు శనివారం వర్చువల్‌ సమావేశం నిర్వహించారు…

ఆ విషయంలో దేశంలో రెండో స్థానంలో ఏపీ, కేంద్రానికి నివేదికలు పంపుతున్నా: చంద్రబాబు

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు డాక్టర్లతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ త్యాగాలు, సేవలు వెలకట్టలేనివని తెలుగే దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.

కరోనా మహమ్మారిపై అందరికీ అవగాహన అవసరమన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ వైద్యులతో చంద్రబాబు శనివారం వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.

కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అధ్యయనాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నానని చెప్పారు.

కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ను కాపాడుకోవాలన్నారు.

గత 2 వారాల్లో ఏపీలో కరోనా వైరస్ వృద్ధి రేటు అత్యధికంగా ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మరణాల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు.

ప్రజలను అప్రమత్తం చేయడం తప్ప ప్రస్తుతానికి మందులు లేవని, డిజిటల్‌ సోషలైజేషన్‌, భౌతిక దూరం రెండూ ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు.

అయితే ఏపీ ప్రభుత్వం ఇలాంటివేవీ పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎక్కువ మందిని ఒకే అంబులెన్స్‌లో తీసుకొస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, దీనివల్ల పాజిటివ్‌ లేని వారికి కూడా వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.

అంబులెన్స్‌లు, ఆస్పత్రుల్లోనూ శానిటైజేషన్‌ ఎంతో ముఖ్యమని చంద్రబాబు అన్నారు.

క్వారంటైన్‌ కేంద్రాల్లో తగిన వసతులు ఉంటే రోగులు భయపడకుండా ఉంటారని చంద్రబాబు అన్నారు.

కరోనా మృతులకు తగిన రీతిలో అంతిమ సంస్కారాలు జరగకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలకు వేరే అత్యవసరమేది ఉన్నా.. కరోనా పరీక్ష చేయకుండా వైద్యం అందించట్లేదని పేర్కొన్నారు.

కరోనా పరీక్షల ఫలితాల కోసం రోగులు వేచి చూడాల్సి రావడం తగదన్నారు. సమాజాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed