రైతులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్…

YS Jagan కీలక నిర్ణయం.. రైతులకు శుభవార్త
ఎన్నికల హామీల్లో రైతులకు ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకుంటున్నారు. రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. అలాగే రైతులకు కనీస మద్దతు ధర అందేలా.. చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.

1.అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పథకం అమలుకు నిర్ణయం
2.రైతు భరోసా కింద రూ.12500 ప్రభుత్వం అందిస్తుంది

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్.. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దూసుకెళుతున్నారు.

తాజగా రైతులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు జగన్. గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష చేసిన జగన్.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఎన్నికల హామీల్లో రైతులకు ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకుంటున్నారు. రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు.

అలాగే రైతులకు కనీస మద్దతు ధర అందేలా.. చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.

రూ.3000 కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్‌లో పెట్టడంతో పాటూ రైతులకు నష్టం కలగకుండా ఈ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.

గత ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా రద్దు చేశారు.

అలాగే నకిలీ విత్తనాల వ్యవహారంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నకిలీ విత్తన వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని.. అక్రమాలు జరిగితే జైలుకు పంపేందుకు వెనకాడొద్దని అధికారులకు సూచించారు.

విత్తన చట్టం తెచ్చే అంశంపై అధికారులతో చర్చించిన జగన్.. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

గ్రామ సచివాలయాల ద్వారా విత్తనాలు, ఎరువుల పంపిణీ చేయడంతో పాటూ.. వ్యవసాయం, రైతులకు మేలు చేసే విధంగా మంచి సలహాలు ఇచ్చే అధికారులు, సిబ్బందికి సన్మానం చేస్తామన్నారు. రైతులకు బీమా సౌకర్యంపైనా అధికారులతో చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *