జగన్ ని అనుసరిస్తున్న బాబు…

అసెంబ్లీకి నల్ల చొక్కాలు వేసుకుని రావడం, ప్రత్యేక హోదా లో ప్రసంగం.

నాలుగేళ్ల క్రితం నుంచి జగన్ ఈ విషయం మీద ఎలా చెప్తూ వచ్చాడు, ఏ రకంగా నిరసన తెలిపారు… అలాగే జగన్ ని కాపీ కొడుతూ చెప్పాడు చంద్రబాబు.

జగన్ ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక హోదా కోసం పోరాడుదామని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరము అని చెప్పినంత సేపు చంద్రబాబు నాయుడు అందుకు వ్యతిరేకంగానే మాట్లాడారు.

హోదా రాకపోవడం వల్ల నష్టం లేదని అన్నాడు. హోదా ఏమి సంజీవని కాదు అని అన్నాడు. హోదా తో ఏమీ కలిసి రాదు అని చెప్పాడు. హోదాకు మించిన ప్యాకేజీ అని అన్నాడు. ఒకవేళ హోదా అంటే జైలుకే పంపిస్తా అని కూడా హెచ్చరించాడు.

దానికి కారణం కేవలం అప్పుడు ప్రధానమంత్రి మోడీ తో స్నేహం అవసరం. కేంద్రంతో సఖ్యత చాలా ముఖ్యం.

ఇదే చంద్రబాబు మోడీ మహానుభావుడు అని, కేంద్రం అద్భుతమైన సహాయాన్ని చేస్తోంది అని, కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం కూడా పెట్టాడు.

కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా…. ఆ సమయంలో జగన్ ఏం మాట్లాడాడో ఇప్పుడు అది తాను మాట్లాడుతున్నాడు.

మాట్లాడితే తనది 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటారు. జగన్ కి పంచాయితీ ప్రెసిడెంట్ గా కూడా అనుభవం లేదని ఎద్దేవా చేస్తూ ఉంటాడు.

కానీ జగన్ ని కాపీ కొట్టడమే సరిపోతుంది. చంద్రబాబు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్టు ప్రకటించుకున్నాడు. జగన్ ప్రసంగాలను కాఫీ కొడుతున్నాడు.

ఇవి చంద్రబాబు నాయుడు ప్రతిభాపాటవాలు.

ఇంకా జనాలముందు ఇంకేం బయటపడతాయో చూడాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *