మరో సర్జికల్ స్ట్రైక్ జరగాల్సిందే…విదేశాంగ సహాయ మంత్రి

ఉగ్రదాడిలో మరణించిన సైనికుల సంఖ్య 40కి చేరింది. భద్రతా సిబ్బందిని పెట్టనబెట్టుకున్న వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని మంత్రులు హెచ్చరించారు.

ప్రతి రక్తపు బొట్టుకూ బదులు తీర్చుకుంటామన్నారు.

జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన సైనికుల సంఖ్య 40కి చేరింది. భారీ సంఖ్యలో సైన్యాన్ని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి పట్ల సైన్యం రగిలిపోతోంది. ప్రతీకార చర్యకు తహతహలాడుతోంది.

కేంద్రం కూడా ఉగ్రదాడి ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ప్రధాని మోదీ ఈ దాడిని ఖండించారు.

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

భద్రతా దళాలను జైషే మహ్మద్ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకోవడం పట్ల సామాన్యుడి రక్తం మరిగిపోతోంది. దెబ్బకు దెబ్బకొట్టాలని, వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇండియా వాంట్స్ రివేంజ్ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఉగ్రదాడి పట్ల తీవ్రంగా స్పందించారు. సైనికుల ప్రతి రక్తం బొట్టుకి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన తెలిపారు.

ఈ దాడి వెనుక ఉన్న వారిపై కఠినమైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా స్పష్టం చేశారు. వీరి మాటలను బట్టి మరోసారి ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడి చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *