ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మహర్దశ త్వరలో 100 కోట్ల నిధులు విడుదల

కేంద్రం రాష్ట్రీయ ఉచ్ఛతార్ అభియాన్ పథకం( రూసా)_2 కింద 100 కోట్లు విడుదల చేయడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసిన నేపథ్యంలో భారీ ఎత్తున అభివృద్ధికి ఆస్కారం కలిగినట్లయింది.

విద్యార్థులు చదువులు, పరిశోధనలతొ పాటు వారికి ఉద్యోగ అవకాశాలు పెంచడానికి. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి, మంచి సంస్థల్లో ఉద్యోగాలు రావడానికి వీలుగా పలు నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు.

ముఖ్యంగా విన్నూతన ఆలోచనలతో కొత్త కొత్త ఉత్పత్తులు. తయారు చేయడానికి ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించే విధంగా తగిన చర్యలు చేపడతారు.

తయారుచేసిన ఉత్పత్తుల నాణ్యతను ప్రమాణాలను తెలుసుకోవడానికి వీలుగా, విభిన్న ప్రయోజనాలు కలిగే విధంగా ఒక టెస్టింగ్ ప్రయోగశాల కూడా ఏర్పాటు చేస్తారు.

ముఖ్యంగా వర్సిటీలోని ఫార్మా రంగానికి ఉపయుక్తమైన పరిశోధనలనుచేయడానికి వీలుగా ప్రయోగశాల అభివృద్ధి చేస్తారు.

అమెరికాలోని ఫర్డ్ విశ్వవిద్యాలయం సహకారంతో విద్యార్థులకు అవసరమైన అంతర్జాతీయ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం వచ్చే విద్యా సంవత్సరం ,నుంచి మరో ఎంబీఏ కోర్సును కూడా నిర్వహించాలని నిర్ణయించింది.

జాతీయస్థాయిలో మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకునిర్వహించే రాత పరీక్ష ఆధారంగా విద్యార్థులు ఎంపిక చేసి సిట్లను కేటాయిస్తుంది.

50 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల వారికి కేటాయించి, 50 శాతం సీట్లను ఏపీ విద్యార్థులకు ఇవ్వనుంది.

విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి కూడా ఆచార్యులను పిలిపించి విద్యాబోధన చేయించాలని భావిస్తోంది.

వర్సిటీ ప్రతిష్ట జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెలుగోoదాలంటె జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిభావంతులైన వారికి కొన్ని కోర్సులు నిర్వహించడం ముఖ్యమని భావిస్తోంది.

దీంతోపాటు మల్టీ డిసిప్లీనరీ, ఇంటర్ డిసిప్లీనరీ కోర్సులను అందుబాటులోకి తెస్తుంది.

దీని కోసం 26 కోట్లు వెచ్చించనుంది. విదేశీ విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకొనునారు.

విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి వీలుగా రూసా_2 నిధులను వెచ్చిస్తాం.

అన్ని రకాల మౌలిక వసతులను అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దాలని యోచిస్తున్నాం.

రూసా_2 పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించిన నేపథ్యంలో త్వరలో ఆయా నిధులు విడుదల కానున్నాయి. వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *