అదిగో అదిగో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోంది….

ముందుగా ఊహించుకున్న టు గా…. ఫిబ్రవరి నెలాఖరునే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.

ఈ విషయం పై సంఘం అధికారులు సమాచారం ఇస్తున్నారు. మరో రెండువారాల్లో ఎన్నికల తేదీలతో కూడిన షెడ్యూల్ ను విడుదల చేసే అంచనాలు ఉన్నాయి .ఫిబ్రవరి నెల ఆఖరి రోజును అందుకు ముహూర్తంగా పెట్టుకున్నట్టుగా తెలుసుతోంది..

సరిగ్గా రెండువారాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నదని.. మార్చినెల ఆరంభంలో ఫస్ట్ ఫేస్ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతోందని సమాచారం.

మార్చి నెలాఖరుకు ఫస్ట్ ఫేస్ ఎన్నికల పోలింగ్ కూడా జరగబోతోందని తెలుస్తోంది.

ఆ తర్వాత మొత్తం ఐదుదశల్లోనే ఎన్నికలను పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.

మొత్తానికి ఏప్రిల్ నెల ఆఖరుకు అన్ని విడతల పోలింగ్ పూర్తి అయ్యేలా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ వేయబోతోందని సమాచారం.

మే నెలలో ఈసారి ఎండలు మండిపోయే అవకాశం ఉందని.. అందుకే ఏప్రిల్ నెలాఖరుకే మొత్తం పోలింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తోందట కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఓవరాల్ గా గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే దాదాపుగా పక్షంరోజుల ముందే ఎన్నికల ప్రక్రియ మొదలై.. పక్షంరోజులు ముందుగానే విజేతలు ఎవరో తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు సీఈసీ అన్ని రకాలుగానూ సన్నద్ధం అవుతోంది. పార్టీలు కూడా ఈ మేరకు రెడీ అవుతున్నాయి అని సమాచారం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *