ఓవైపు అమలాపురం ఎంపీ వైసీపీ లోకి ….మరోవైపు రంగంలోకి దిగుతున్న బాలయోగి కుమారుడు హరీష్..

ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండటం… ఈసారి తమకు సీటు దక్కుతుందని భరోసా లభించిన నేతలు ఇతర పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారు.
ఏపీలో ప్రస్తుతం అధికార టిడిపి నుంచి వైసీపీలోకి వలస ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
నేతలందరూ ఏపీలో జంపింగ్ బాట పడుతున్నారు… ప్రస్తుతం టిడిపి నుండి వైసీపీలోకి ఈ విధానం జరుగుతుంది. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో కి చేరారు.
అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబులు జగన్ సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరందరికీ టికెట్ దక్కదని ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు సమాచారం.
అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర బాబు వైసీపీలో చేరగానే అక్కడ అనూహ్య పరిణామాల చోటుచేసుకున్నాయి.
మాజీ ఎంపీ ,దివంగత లోకసభ స్పీకర్ జీఎంసి బాలయోగి కుమారుడు… హరీష్ ను తెలుగుదేశం పార్టీ రంగంలోకి దింపింది.
అమలాపురం టికెట్ నాలుగోది కుటుంబానికి ఇవ్వడానికి చంద్రబాబు సముఖంగా ఉన్నట్లు తెలియడంతో హరీష్ అధిష్టానం ప్రమోట్ చేస్తూ ఎంపీగా ఉన్న తనను పక్కన పెట్టడంపై రవీంద్ర బాబు మనస్తాపానికి గురైనట్లు సమాచారం.
వైసీపీలో చేరిన రవీంద్ర భారతి కలగడం లేదా రాజోలు అసెంబ్లీలో జగన్ ఖరారు చేసినట్లు సమాచారం. బాలయోగి కుటుంబం పట్ల అమలాపురం నియోజకవర్గంలో సానుకూలత ఉన్నందున ఆయన తనయుడు రంగంలోకి దించి విజయం సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు. సో, సిట్టింగ్ ఎంపీ రవీంద్ర బాబు ని లైట్ తీసుకున్నట్లేగా….
వచ్చే ఎన్నికల్లో తాను గెలిస్తే మంత్రి పదవి కాలం పట్టుబడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేగా న వైసీపీలోకి చేరితే, అదే నియోజకవర్గంలో ఉన్న వైసిపి నేత టిడిపికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని… టిడిపి పార్టీ నేతలతో చర్చించిన రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు…