బంద్ కు పిలుపునిచ్చిన ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్‌ఎన్ఎల్ (ఏయూఏబీ)

ప్రైవేటు గుప్పెట్లో ప్రభుత్వ రంగ సంస్థను ఉంచేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఏయూఏబీ ఆరోపించింది.

బలోపేతం చేయాల్సిన సంస్థను బలహీన గా మరిచే విధంగా కుట్రలు పన్నుతున్నారని మండిపడింది.

దేశవ్యాప్తంగా సమ్మె జరిపిన ఉద్యోగులు సంస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు అని ఆరోపణ చేశారు.4జీ స్పెక్ట్రమ్, వేతన సవరణ డిమాండ్ల సాధనకు కదంతొక్కిన ఉద్యోగులు

బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. విధుల్ని బహిష్కరించారు. ధర్నాలతో నిరసన తెలియజేశారు.

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ స్పెక్టమ్ కేటాయించడం, ఉద్యోగుల వేతన సవరణ వంటి అంశాల సాధన కోసం ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్‌ఎన్ఎల్ (ఏయూఏబీ) మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది.

సోమవారం ప్రారంభమైన సమ్మె బుధవారం వరకు కొనసాగనుంది.

ఉద్యోగుల ధర్నా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి.

దాదాపు 90 శాతం వరకు ఉద్యోగులు, కార్మికులు విధుల్ని బహిష్కరించడంతో కార్యాలయాలన్నీ ఖాళీ అయ్యాయి. ఉద్యోగులు పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టిరు.

ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు గుప్పెట్లో ఉంచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఏయూఏబీ ఆరోపించింది. బలోపేతం చేయాల్సిన సంస్థను బలహీన పరిచే విధంగా కుట్రలు జరుగుతున్నాయని మండిపడింది.

తొలి విడతగా మూడు రోజుల సమ్మె సాగుతుందని, కేంద్రం స్పందించకపోతే.. పోరు తీవ్రతరం చేస్తామని హెచ్చరింఛాడం జరిగింది.

జమ్మూకశ్మీర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ సర్కిల్‌లో సమ్మె జరగడం లేదు. పుల్వామా ఎఫెక్ట్ కరాణంగ ,ఈ ప్రాంతంలో సమ్మె నిర్వహించడం లేదని ఏయూఏబీ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *