మొత్తం డేటా ఐటీ గ్రిడ్ చేతిలోనే ….

ఐటీ గ్రిడ్ వద్ద ఏపీ ప్రజలకు సంబంధించిన పూర్తి డేటా ఉందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారిందని చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన డేటా చోరీకి సంబంధించి ఏ పార్టీ వాదన ఎలా ఉన్నా… అసలు ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న . అసలు ఐటీ గ్రిడ్ వద్ద ఆ తరహా డేటా లేకుంటే… ఈ వివాదం ఇంత పెద్ద సమస్యగా మారేదే కాదు కదా.

బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆరోపిస్తున్నట్లుగా… ఐటీ గ్రిడ్ వద్ద వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి సంబంధించిన,తన ఆధ్వర్యంలోని సాక్షి దినపత్రిక రీడర్ల వివరాలున్నాయన్నాయంటే…. ఇది మామూలు విషయం కూడా కాదు కదా …అన్న వాదన కూడా వినిపిస్తోంది.

ఈ క్రమంలో అసలు ఐటీ గ్రిడ్ వద్ద ఏపీ ప్రజలకు సంబంధించిన పూర్తి డేటా ఉందా? లేదా? అన్న విషయాన్ని తేల్చుకునేందుకు ఇప్పుడు ఓ చిన్న ఉదాహరణను పరిశీలిస్తే… మొత్తం తతంగం బయటపడుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి..

ఏపీలో అధికార పార్టీ టీడీపీ… తమ కార్యకర్తలకు సంబంధించిన వివరాలను నిక్షిప్తం చేసుకుంటే తప్పేముందని వాదిస్తోంది. ఐటీ గ్రిడ్ సంస్థను తామే నియమించుకున్నామని చెబుతు…ఇందుకోసమే ఐటీ గ్రిడ్ సేవలను తాము వినియోగించుకుంటున్నామని కూడా టీడీపీ వాదిస్తోంది.

ఇదంతా బాగానే ఉన్నా… టీడీపీ వాదననే ఆధారం చేసుకుని ఓ చిన్న విషయాన్ని పరిశీలిద్దాం. ఏ వ్యక్తి అయినా టీడీపీ వద్దకెళ్లి తమకు పార్టీ సభ్యత్వం ఇవ్వమని అడిగితే… సదరు టీడీపీ సిబ్బంది ఏం అడుగుతారు? మీ ఆధార్ కార్డో లేదంటే మీ ఓటరు ఐడీ కార్డో ఉందా? అంటూనే… ఉంటే గింటే… ఆ రెండింటిలో ఏదో ఒక నెంబర్ చెప్పమని అడుగుతారు.

చేతిలో అధునాతన ట్యాబ్ తో కనిపించే టీడీపీ సభ్యత్వ నమోదు కార్యకర్త… మనం ఆ నెంబర్ చెప్పగానే… సదరు ట్యాబ్ లో ఆ నెంబర్ ను ఫీడ్ చేసుకుని అక్కడికక్కడే మనకు టీడీపీ సభ్యత్వ నమోదు కార్డు ఇస్తారు అని చెబుతున్నారు

ఆధార్ కార్డో లేదా ఓటరు ఐడీ కార్డుకు చెందిన నెంబరు మాత్రమే చెబితే… మన పేర్లు అడ్రెస్ తో కూడిన వివరాలతో ఉన్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్డు వస్తుంది అని అంటున్నారు.

ఆధార్ ఓటరు ఐడీలలో ఏదో ఒకటి చెబితేనే… మనకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కార్డు వస్తుందంటే… టీడీపీ వద్ద ఏపీ ప్రజలకు చెందిన సమగ్ర వివరాలు ఉన్నట్టే కదా.

మరి టీడీపీ వద్ద ఏపీ జనానికి సంబంధించి పూర్తి డేటా ఉంటే… సదరు డేటాను నిక్షిప్తం చేస్తున్న ఐటీ గ్రిడ్ వద్ద ఆ సమాచారం మొత్తం ఉన్నట్టే కదా.

అంటే…. ఏపీ ప్రజలకు సంబంధించిన పూర్తి డేటాను ఐటీ గ్రిడ్ తస్కరించేసిందన్న వాదనలో నిజమే ఉందన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ విషయాన్ని ముందు పెడితే… టీడీపీ నేతలు ఏం చెబుతారో తెలియదు గానీ… ఐటీ గ్రిడ్ కు సంబంధించిన మొత్తం విషయం బయట పడిపోతుంది అని సంభాషణలు సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *