పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైన అలీ.. గుంటూరు నుంచి బరిలోకి దిగబోతున్నారా?

వచ్చే ఎన్నికల్లో పోటీకి కసరత్తు ప్రారంభించిన కమెడియన్ అలీ. ఓటు కోసం ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకున్న స్టార్ కమెడియన్.

గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారంటూ ప్రచారం.

తెలంగాణలో ఉన్న ఓటును తొలగించినా అభ్యంతరం లేదన్న అలీ గుంటూరు తూర్పు నుంచి ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న కమెడియన్ టీడీపీ నుంచి అలీ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సినీ నటుడు, కమెడియన్ అలీ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారా..

ఎన్నికల బరిలో నిలిచేందుకు కసరత్తులు ప్రారంభించారా.. తెలంగాణలో ఉన్న ఓటును ఏపీకి మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారా అంటే.. పరిస్థితులు చూస్తే అలాంటి వాతావరణమే కనిపిస్తోంది.

అలీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు కోసం దరఖాస్తు రిటర్నింగ్ అధికారికి చేసుకున్నారట.

ఆ ధరఖాస్తును పరిశీలించిన అధికారులు.. హైదరాబాద్‌లో ఉన్న ఓటును గురించి ప్రస్తావించారట. అక్కడి ఓటును తొలగించినా ఇబ్బందిలేదని.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కల్పించాలని కోరారట.

దీంతో ఓటు నమోదుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

అలీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడంతో వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయమని ప్రచారం ఊపందుకుంది.

మరి ఏ పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నారన్నది మాత్రం ప్రస్తుతానికి కాస్త సస్పెన్స్‌గానే ఉంది.

అదే సమయంలో టీడీపీ నుంచి పోటీచేయడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈమధ్యే విజయవాడలో జరిగిన అలీ నాలుగు దశాబ్దాల సినీ జీవిత మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు.

అంతకముందు కూడా అలీ మంత్రి గంటాతో పాటూ చంద్రబాబును కలవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కుగా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ నుంచి గెలిచిన ముస్తఫా ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి అలీని బరిలోకి దించేందుకు టీడీపీ సిద్ధమయ్యిందనే టాక్ అమరావతిలో వినిపిస్తోంది.

అధినేత చంద్రబాబు కూడా అలీ పేరును పరిశీలనలోకి తీసుకొని.. నియోజకవర్గ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. అలీ పోటీపై త్వరలోనే క్లారిటీ వస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *