తలసాని పై కౌంటర్ వేసిన అచ్చన్న…. కేసీఆర్ ను నిలదీయడం చాతకాదు అని విమర్శలు…

విజయవాడలోని ఓ వివాహానికి హాజరైన తలసాని ఏపీలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందంటూ రెండు రోజుల కిందట ఆరోపించారు.
టిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శలు చేశారు.

తలసాని వ్యాఖ్యలపై టిడిపి నేతలు అంతే గట్టిగా స్పందించారు. ఎదురుదాడి కూడా చేస్తున్నారు… తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణలో బీసీలకు అన్యాయం జరిగితే కేసీఆర్ను నిలదీయడం చేతకాని తలసానికి ఏపీ గురించి మాట్లాడే అర్హత లేదని భగ్గుమన్నారు.

తెలంగాణలో 25 కులాలను బీసీ నుంచి తొలగించి ఓసి లో చేర్చితే నిలదీయడం చేతకాదని అన్నారు….అదే తలసాని స్థానంలో తను ఉండి ఉంటే రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకునే వాడిని అని అన్నారు.

తామేమీ గాజులు తొడుక్కుని కూర్చోలేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రెండుసార్లు ఏపీ కి వెళ్లినా కలశాన్ని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

జనవరిలోనూ ఏపీ లో పర్యటించిన తలసాని తప్పకుండా తాము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని ప్రకటించారు. అంతేకాదు ఏపీలోనూ బీసీలకు తను నాయకత్వం వహిస్తానని తెలిపారు. ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ కావడానికి కారణం బాబే అని ఆరోపించారు.

రెండు రోజుల కిందట విజయవాడలోని ఓ వివాహానికి హాజరైన తలసాని ఏపీలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆరోపించారు.

అగ్రవర్ణాల పేదలకు కేంద్రం కల్పించిన పది శాతం రిజర్వేషన్లలో సగం కాపులకు మాత్రమే ఇవ్వడం ఏంటని నిలదీసిన ఆయన, వాటితో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు.

ఎప్పుడు చూసినా ఏపీ ప్రభుత్వం రెవెన్యూ లోటు గురించి పదేపదే చెబుతోందని ఆదాయం లేని చోట ఆర్భాట ప్రచారాలు ఎందుకని హేళన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *