బెంగళూరులో ఏర్పాటయిన ఎయిర్ ఇండియా 2019 ఎయిర్షో లో ప్రమాదo

బెంగళూరు ఎయిర్ షో లో రెండు యుద్ధ విమానాలు పరస్పరం ఎదురెదురుగా గాల్లోనే ఢీ కొట్టుకున్నాయి. మంటల్లో చిక్కుకుపోయాయి, అగ్నిగోళంలా మారిపోయాయి.

నిప్పులు చిమ్ముతూ నేలపై రాలిపోయాయి. చూస్తుండగానే కుప్పకూలిపోయాయి, ఈ ఘటనలో ఓ కో పైలట్ మృతి చెందారు. మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

మంగళవారం మధ్యాహ్నం బెంగళూరులో నగర శివారులోని యలాహంక ఎయిర్ బేస్ లో టెర్మినల్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

బుధవారం నుంచి ఎయిర్బేస్ టెర్మినల్ లో ఏరో ఇండియా 2019 ఆరంభం కానుంది ఆరంభం కానుంది.

దీనికోసం కొద్దిరోజులుగా వైమానిక దళం అధికారులు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. రిహార్సల్స్ లో భాగంగా వివిధ రకాల యుద్ధ విమానాలు ,హెలికాప్టర్లు విన్యాసాలు చేస్తున్నాయి.

మంగళవారం ఉదయం కూడా ఈ రిహార్సల్స్ ఆరంభమయ్యాయి. సూర్య కిరణ్ ఏరోనాటిక్స్ బృందానికి చెందిన రెండు తేలికపాటి హెలికాప్టర్లు ప్రదర్శన ఇస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.

రెండు హెలికాప్టర్ లు అతి సమీపానికి చేరుకున్న ఘటనను పూర్తి చేయు లోపు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఆ సమయంలో రెండు హెలికాప్టర్ లు సుమారు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టు ప్రాథమికంగా అందిన సమాచారం. గరిష్టంగా సూర్యకిరణ విమానాలు గంటకు 650 కిలోమీటర్ల వేగంతొ ప్రయాణించగలవు.

హెలికాప్టర్ లో ఉన్న పైలెట్, కో పైలట్ ప్రమాదాన్ని పసిగట్టి కిందకు దూకేశారు. మరో హెలికాప్టర్ లో ఉన్న copilot మృత్యువాత పడ్డారు .ఢీ కొట్టిన వెంటనే హెలికాప్టర్ లు ముక్కలు ,ముక్కలు అయ్యాయి.

కొన్ని శకలాలు హైదరాబాద్ to బెంగళూరు జాతీయ రహదారి సమీపాన ఎగిరిపడ్డాయి.

సమాచారం అందుకున్న వెంటనే యలాహంక లో మరికొన్ని ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *