మేయర్ అలక! రంగంలోకి దిగిన అధిష్టానం

మేయర్‌కు ఎమ్మెల్సీగా అవకాశం

అబ్దుల్‌ అజీజ్‌తో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద చర్చలు

నెల్లూరు నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారు. ఈ మేరకు అధిష్టానం జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర ద్వారా మేయర్‌కు సమాచారం పంపింది.

రవిచంద్ర.. మేయర్‌ను కలిసి ఆ విషయం వివరించారు. ఈనెల 15న రాజధానికి రమ్మని పార్టీ అధినేత చంద్రబాబు తెలిపినట్లు మేయర్‌కు చెప్పారు. మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించారు.

నెల్లూరు నగరం, అది సాధ్యం కాని పక్షంలో రూరల్‌ నుంచి అయినా తనకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరారు.

టిక్కెట్‌ ఇవ్వలేని పక్షంలో ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తామని మంత్రి నారాయణ, పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర గతంలో మేయర్‌కు హామీ ఇచ్చారు.

ఇప్పుడు నెల్లూరు, రూరల్‌ అభ్యర్థుల ప్రకటనతో మేయర్‌ అజీజ్‌ అలుకబూనారు. జిల్లా వ్యాప్తంగా ముస్లిం వర్గాల నుంచి మరోమారు మేయర్‌ అజీజ్‌కు న్యాయం చేయాలనే డిమాండ్‌ ఊపందుకుంది.

విషయం తెలుసుకున్న అధిష్టానం జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవించంద్రను మేయర్‌ వద్దకు దూతగా పంపింది.

”అధిష్టానం మీకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి నిర్ణయించుకుందని, ఈనెల 15వ తేదిన అమరావతికి తీసుకురమ్మని ఆదేశించిందని” బీద మేయర్‌కు తెలిపారు.

నెల్లూరు సీటీ, రూరల్‌, సర్వేపల్లి అభ్యర్థులను ప్రకటించిన సందర్భంలో తన ఎమ్మెల్సీ కూడా ప్రకటించి ఉంటే గౌరవంగా ఉండేది కదా అని పార్టీ అధ్యక్షుడితో మేయర్‌ నిష్టూరపోయినట్లు తెలిసింది.

అనంతరం ఆయన అజీజ్‌కు నచ్చజెప్పినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *