అలీని దెబ్బకొడుతున్న స్థానికత! టికెట్ దక్కేనా?

గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం విషయంలో పోటీపడుతున్న కమేడియన్ అలీ విషయంలో స్థానిక నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్టుగా సమాచారం.

అలీకి టికెట్ ఇస్తే సహించేది లేదని.. స్థానిక నేతలు అంటున్నారు.

అందులోనూ ముస్లిం మైనారిటీ నేతలే అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్న వారిలో ఉండటం విశేషం.

ఈ సీటును ముస్లింలకు కేటాయించడాన్ని స్వాగతిస్తూనే.. అలీ స్థానికేతరుడు అని, ఆయనకు కాకుండా తమకే ఇవ్వాలని స్థానిక ముస్లింనేతలు అంటున్నారు.

మహబూబా అనే ముస్లిం మైనారిటీ నేత అక్కడ టికెట్ విషయంలో గట్టిగా పోటీపడుతూ ఉన్నారని సమాచారం.

గుంటూరు లోక్ సభ సీటు పరిధిలోని అసెంబ్లీ సీట్ల విషయంలో చంద్రబాబు నాయుడు వరసగా సమీక్షలు నిర్వహిస్తున్నా ఏమీ తేల్చలేకపోతూ ఉన్నారు.

ఈ నియోజకవర్గంలో కొన్ని సీట్లకు ఇన్ చార్జిలే లేరు. మోదుగుల తెలుగుదేశం పార్టీని వీడినట్టే అని అంటున్నారు.

ఇక మరికొన్ని సీట్ల విషయంలో కూడా కొత్త వాళ్లను తెచ్చిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని సమాచారం.

ఎంపీ అభ్యర్థితో సహా అందరూ స్థానికేతరులే ఇక్కడ పోటీకిదిగే పరిస్థితి ఉందని వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *