6.61 లక్షలు రూ.విరాళం గా అందాజెసిన ఓ మహిళ యాచకురాలు…………. అమర జవాన్ల కుటుంబాలకు చేయూత….

రోజూ పైసా పైసా కూడబెట్టిన మొత్తాన్ని సైనికుల కుటుంబాలకు విరాళంగా ఇచ్చేసింది ఓ మహిళ…

ఈ ఘటన రాజస్థాన్‌లో వైరల్‌గా మారింది.పుల్వామా ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ఓ యాచకురాలు రూ.6.61 లక్షలు విరాళంగా ఇచ్చింది.

చనిపోయిన తర్వాత గొప్ప దాతగా మారింది ఓ మహిళ.. బతికినన్నాళ్లూ గుడి ముందు భిక్షాటన చేసి కాలం వెళ్లదీసింది.

దేశ ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చేలా తను కూడబెట్టిన మొత్తాన్ని అమర జవాన్ల కుటుంబాలకు విరాళం ఇచ్చేసింది.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో అంబే మాతా గుడి బయట నందినీ శర్మ అనే మహిళ భిక్షాటన చేసి రూపాయి రూపాయి కూడబెట్టేది. ఆ సొమ్మును రోజూ బ్యాంకులో జమ చేసేది.

ఆమె మరణించే సమయానికి బ్యాంకులో దాచిన మొత్తం రూ.6.61 లక్షలు అయ్యింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని పుల్వామా ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనిక కుటుంబాలకు విరాళంగా ఇచ్చేశారు.

నందినీ శర్మ బ్యాంక్ ఖాతా తెరిచే సమయంలో ఇద్దరు వ్యక్తులను నామినీలుగా ప్రకటించింది. ఆమె ఇటీవల మరణించడంతో.. ఆమె దాచుకున్న నగదును ఏదైనా మంచి పనికి ఉపయోగిస్తే బాగుంటుందని నామినీలు భావించారు.

పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సైనిక కుటుంబాలకు సాయం చేస్తే.. నందినీ ఘన నివాళి అర్పించినట్టు అవుతుందని భావించిన వారు.. వెంటనే జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించారు.

బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన వారు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.6.61 లక్షలను విరాళంగా ఇస్తామని చెప్పారు. వెంటనే లీగల్ సెల్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసింది. అజ్మీర్ కలెక్టర్ విశ్వ మోహన్ శర్మ ఆ మొత్తాన్ని విరాళంగా తీసుకొని సర్టిఫికెట్ జారీ చేశారు.

భిక్షాటన చేసిన కూడబెట్టిన సొమ్ము అయినప్పటికీ.. అమర జవాన్లకు ఈ మొత్తం ఉపయోగపడుతుండటం నిజంగా గొప్ప విషయం కదా.

అందుకే గుడి ముందు ఆమెకు డబ్బులు దానం చేసిన వారు… ఈ విషయం తెలుసుకొని సంతోషించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని మానం కుడా స్ఫూర్తి గా తిసుకోవలి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *