గుర్రాన్ని 5 కి.మీ మోసుకెళ్లిన….. ‘బాహుబలి’


సోషల్ మీడియాను వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అవసరమైన విషయాల కంటే ఇతర విషయాలను, అబద్ధాలను ఎక్కువగా షేర్ చేస్తూ ఇతరులను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు.

అతడికి గిన్నిస్ రికార్డులు కొత్తేమీ కాదు, కానీ కొన్ని నమ్మశక్యంగా ఉండవు

1.ఉక్రేనియా బాహుబలి డిమిత్రి ఖలాడ్జి గుర్రాన్ని మోసుకెళ్లిన వీడియో వైరల్
2.అతడు ఎందుకోసం మోశాడు, ఏంటి కథ అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.

పాము కరిచిన గుర్రాన్ని ఓ వ్యక్తి దాదాపు 5 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాడట. కెవిన్ అనే ట్విట్టర్ యూజర్ ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశాడు. మనిషి, గుర్రం ఇద్దరు సేఫ్ అని ట్వీట్లో రాసుకొచ్చాడు.

జనవరి 14న పోస్ట్ చేసిన వీడియో 25,000 సార్లు రీట్వీట్లతో పాటు లక్షకు పైగా లైక్స్ సంపాదించింది. ఓవరాల్‌గా 35 లక్షల మంది వీడియోను వీక్షించారు.

వీడియో మాత్రం అబద్ధం కాదు. పాము కరవడంతో అతడు గుర్రాన్ని మోశాడన్నది బద్ధం. ఎందుకంటే గుర్రాన్ని మోసుకెళ్లిన వ్యక్తి మాములోడు కాదు.

అతడి పేరు డిమిత్రి ఖలాడ్జి. ఉక్రేనియా క్రీడాకారుడు. 63 గిన్నిస్ రికార్డులను కొల్లగొట్టడం అతని ఘనతకు నిదర్శనం. ఉక్రెనియా చాంపియన్లకే చాంపియన్‌గా అతడు చాలా ఫేమస్.

ఉక్రేనియా ‘బాహుబలి’ డిమిత్రికి గుర్తింపు, ప్రత్యేకత తీసుకొచ్చిన అంశాల్లో గుర్రాలను మోసుకెళ్లడం ఒకటి.

ట్రక్కులను అవలీలగా తన శరీరం మీదుగా పోనించుకుని సాహసాలు చేస్తుంటాడు. పళ్లతో ఇనుప రాడ్లను వంచడం అతడికి వె న్నతో పెట్టిన విద్య.

అని గూగుల్‌లో టైప్ చేస్తే అసలు నిజం మీకే తెలుస్తుంది. ఖలాడ్జికి సాహసాలకు సంబంధించి యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు ఉన్నాయి.

ఈ కింది వీడియోను నవంబర్ 18, 2017న అప్‌లోడ్ చేశారు. ఉక్రేనియా బలవంతుడు, పవర్ లిఫ్టర్ డిమిత్రి ఖలాడ్జి పేరిట 63 గిన్నిస్ రికార్డులు ఉన్నాయి.

సరదా కోసం గుర్రాన్ని ఎత్తాడు అని వీడియో వివరాలలో పేర్కొన్నారు. ప్రచారం జరుగుతున్నట్లుగా ఆ గుర్రాన్ని పాము కరవలేదు, అదేవిధంగా మహాబలవంతుడు డిమిత్రి, గుర్రాన్ని 5 కి.మీ మోసుకెళ్లలేదు.

పాము కరవడంతో ఇబ్బంది పడుతున్న గుర్రాన్ని ఉక్రేయిన్ ‘బాహుబలి’ డిమిత్రి ఖలాడ్జి ఐదు కిలోమీటర్లు మోసుకెళ్లాడన్నది నిజం కాదు. వివరాలు తెలియకుండా కొండరు వీడియోను షేర్ చేస్తున్నారు. గుర్రాన్ని మోయడం మాత్రమే నిజం. అయితే కి.మీ దూరం మోయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *