40 మంది జవాన్ల …. 20 మందికి తీవ్ర గాయలు… త్యాగాలను జాతి మరవదు.. ఉగ్రదాడిపై జనసేన

40 మంది జవాన్ల …. 20 మందికి తీవ్ర గాయలు… త్యాగాలను జాతి మరవదు.. ఉగ్రదాడిపై జనసేనాన
భద్రతాబలగాలపై ఉగ్రవాది చేసిన ఆత్మహుతి దాడి హేయమైనదని పవన్ అన్నారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. శత్రువులు భారత్ వైపు కన్నెత్తి చూడకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల వీర మరణం, 20 మందికి తీవ్ర గాయాలుదాడికి బాధ్యత ప్రకటించుకున్న పాక్ ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ఆత్మహుతి దాడి హేయమైనదన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య 43కు పెరిగింది.
పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ దుర్ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడిని ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు.
తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ ఉగ్రదాడిపై స్పందించారు.
భద్రతాబలగాలపై ఉగ్రవాది చేసిన ఆత్మహుతి దాడి హేయమైనదని పవన్ అన్నారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఈ దాడిలో 36 మంది (అప్పటి మృతుల సంఖ్య) సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం మనసుని కలచివేసింది. మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు వస్తున్న వార్తలు బాధ కలిగిస్తున్నాయి.
అమరవీరులకు నా తరఫున, జనసైనికుల తరఫున సెల్యూట్ చేస్తున్నాను. వారి త్యాగాలను భారత జాతి ఎన్నటికీ మరవదు. అమరులైన ఆ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
దేశం యావత్తు అమరుల కుటుంబాలకు అండగా నిలవాలి. క్షతగాత్రులైనవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
శత్రువులు మన వైపు కన్నెత్తి చూడకుండా చేయడంతోపాటు జవాన్లలో ఆత్మస్థైర్యం నింపాల్సిన తక్షణ బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది’ అని జనసేన పార్టీ తరఫున విడుదల చేసిన ప్రకటనలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రకటించింది.
తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ ఈ ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది.
స్కార్పియో కారులో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఆదిల్.. జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకుని ఒక బస్సును ఢీకొట్టాడు. దీంతో భారీ పేలుడు సంభవించింది.
ఈ పేలుడు దాటికి జవాన్ల బస్సు, ఉగ్రవాది కారు తునాతునకలయ్యాయి. ఉగ్రవాది ఆదిల్‌తో పాటు జవాన్ల మృతదేహాలు ఛిద్రమయ్యాయి.