ఇండియాలో నోట్ల రద్దయి ఇన్నేళ్లైనా వాటిపైన పార్లమెంట్లో జవాబుదారి ఎవరు?

The controversy around demonetis ation has reached the corridors of the Supreme Court.
అదిగో 2000 నోటు రద్దు.. ఇదిగో 500 నోటు రద్దు.. కొత్తగా 3000 వేల నోటు వస్తోంది. లేదు లేదు వందరూపాయిలే ఇక పెద్ద నోటు.. ఇలా సోషల్ మీడియాలో వార్తలు రోజూ కోకొల్లలుగా వస్తున్నాయి. “ఏది నిజం, ఏది అబద్ధమో తెలియటం లేదు చెప్పవలసిన కేంద్ర పెద్దలు అవునని కానీ, కాదని కానీ, తేల్చి చెప్పటంలేదు. అసలు కేంద్ర ప్రభుత్వానికి అయినా తెలుసా… తెలిసిన ప్రజలకు వివరించలేక పోతున్నారా. అనేది పార్లమెంట్లో ప్రశ్నార్థకంగా మారింది. ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చేది ఎవరు..”
ఇలా చేయడం వల్ల దేశంలో చాలా వ్యవస్థల మీద నమ్మకం లేకుండా పోతోంది. రాజ్యాంగబద్దమైన వ్యవస్థలు తమ పనులను తాము న్యాయం చేయడం లేదనే విషయం భారతీయులకు తెలియనిది ఏమీ కాదు. ఏ వ్యవస్థను ఆయన మనఘలే నడుపుతారు కదా.. మనుషులకు అన్నీ జాడ్యాలూ ఉంటాయి కదా అందుకే వ్యవస్థలు కూడా సక్రమంగా పని చస్తాయని ఆశించడం తప్పైపోతుంది. అయితే ఈ జాడ్యాలు మన దేశానికే ఉండటం దురదృష్టకరం. ప్రపంచ దేశాలన్నిటిలోనూ ప్రభుత్వాలను, ప్రజా సంబంధ వ్యవస్థలనూ మనుషులే నడుపుతున్నారు. అయితే అక్కడ మాత్రం చాలావరకు వ్యవస్థలు సవ్యంగా పని చేస్తూ ఉంటాయి. ఇండియాలో ఇంతే అనుకోవాలి. గత దశాబ్దాంలోనే వ్యవస్థ తీసుకున్న అతి చెత్త నిర్ణయాల్లో ఒకటి నోట్లు రద్దు. ఈ రద్దు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా దాని ఫలితాలు మాత్రం ఎవ్పరూ మర్చిపోలేరు.
నెలల తరబడి ప్రజలను బ్యాంకుల ముందు క్యూల్లో నిలబెట్టిన మోడీ నిర్ణయ ప్రభావం ఇంకా కొనసాగుతూ ఉంది . చాలా మంది ఆర్థికవేత్తలు ఇదే మాట చెబుతున్నారు. నోట్లు రద్దు అత్యంత చెత్త నిర్ణయమని వారు అభిప్రాయపడుతూ ఉంటారు. ఏదో ప్రయత్నం చేశారు, అది మిస్ ఫైర్ అయ్యింది అనే విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం పెద్దలు ఒప్పుకోవడం లేదు. ఒప్పుకుంటే వాళ్ళది చిన్నతనం అవుతుందనే భయం. నోట్లు రద్దు మంచి ఫలితాలను ఇచ్చిందిన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ సంగతి ఏమో కాని ఇప్పుడు మళ్ళీ ప్రజల్లో కొత్త మాట వినిపిస్తోంది. కొత్త పుకార్లు షికార్లు చేస్తున్నాయి త్వరలోనే 2000 రూపాయల నోటు రద్దు అయిపోతుంది అని ఇలాంటి చెత్త వార్తలు చేయడానికి సోషల్ మీడియా ఉండనే ఉంది. వ్యూసే లక్షణంగా చెత్త వైరల్ చేసే యూట్యూబ్ ఛానల్ లో ఈ పని తీవ్రంగా చేస్తున్నాయి.
ఈ పుకారు అలా ఇలా పడి సామాన్యులను చేరుకుంది. ఫలితంగా వాళ్లు రెండు వేల రూపాయల నోటు మీద ఒక అపనమ్మకం ఏర్పడుతుంది గ్రామస్థాయి మండల స్థాయిలో కి వెళ్లి ప్రజలు 2000 రూపాయల నోటు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. కొంచెం భారీ మొత్తం డబ్బు 2000 రూపాయలు నోట్లు ఉంటే వేరే నోట్లు ఇవ్వండి అని అడిగే పరిస్థితి వచ్చింది. మామూలుగా అయితే ఇలాంటి పుకార్లను ప్రజలు విశ్వసించే వాళ్లు కాదు. అయితే మోడీ పుణ్యమా అని మారకంలోని కరెన్సీ అప్పటికప్పుడు రద్దు కావచ్చనే ప్రజలకు అర్థమైంది. దీంతో ఇప్పుడు 2000 రూపాయల నోటు వారిని భయపడుతోంది. ఎలాగూ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి కదా.. ఈ పుకార్లకు ప్రభుత్వం ఏదైనా జవాబు ప్రకటన చేస్తే మంచిదేమో..
ఇక జవాబు కోసం వేచి చూడవలసి వస్తుంది.