ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యవసర సేవలకు ‘112

దేశవ్యాప్తంగా అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన ఒకే టోల్ ఫ్రీ నంబరు 112 ను తొలి విడతలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మంగళవారం అందుబాటులోకి వచ్చాయి.

అత్యవసర సమయాల్లో సేవలకు దేశవ్యాప్తంగా ఒకే టోల్‌ ఫ్రీ నంబరు.112 సేవలను ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభం.పోలీసు, అగ్నిమాపక, ఆరోగ్యం, మహిళా హెల్ప్‌లైన్లు ఒక్కటి చేస్తూ ఈఆర్ఎస్ఎస్

దేశవ్యాప్తంగా అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన ఒకే టోల్ ఫ్రీ నంబరు 112 ను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది.

తొలివిడతలో ఈ సేవలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మంగళవారం ప్రారంభించింది.

పోలీసు, అగ్నిమాపక, ఆరోగ్యం, మహిళా హెల్ప్‌లైన్లు లాంటి అత్యవసర సేవలకు ఇప్పటి దాకా వేర్వేరు నంబర్లు ఉండేవి.

వీటన్నింటినీ ఏకీకృతం చేస్తూ రూపొందించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్ఎస్ఎస్)‌ను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు.

వచ్చే ఏడాది నాటికి దేశవ్యాప్తంగా ఈ నెంబరు అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు.

కొత్తగా రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా అత్యవసర సేవలను 112కు డయల్‌ చేయడంతో పాటు ఇతర విధానాల్లో కూడా పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లో ‘పవర్‌ బటన్‌’ను మూడు సార్లు వెంటవెంటనే నొక్కినా కూడా హెల్ప్‌లైన్‌కు సమాచారం అందుతుంది.

సాధారణ ఫోన్లలో ‘5’ లేదా ‘9’ అంకెను లాంగ్‌ ప్రెస్‌ ద్వారా కూడా ఈ సేవలు పొందే అవకాశం ఉంది.

దేశంలోని సేఫ్‌ సిటీ ప్రాజెక్టుల అమలుకు హైదరాబాద్‌ సహా 8 ప్రాంతాలను గుర్తించినట్లు హోం మంత్రి పేర్కొన్నారు.

దీని కోసం నిర్భయ నిధుల పథకం కింద తొలి విడతగా రూ. 2,919 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇందులో హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి నగరాలు ఉన్నాయి.

మెట్రో నగరాల్లో మహిళల భద్రతకు ఉద్దేశించిన ‘సేఫ్‌ సిటీ’ప్రాజెక్టును సమర్ధవంతంగా అమలు పర్యవేక్షణకు పోర్టల్‌ను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

అత్యవసర సేవల టోల్ ఫ్రీ నెంబరు 112ను తొలి విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, జమ్మూ కశ్మీర్‌‌లో ప్రారంభమయ్యాయి.

ఈ ప్రాజెక్టును కేంద్ర హోం శాఖ, మహిళ శిశు అభివృద్ధి సంయుక్తంగా ప్రారంభించాయి. ఇందు కోసం రూ.321.69 కోట్లు ఖర్చు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *