మహిళ కంటిలో 15 సెంటీమీటర్ల నులి పురుగు శంకర్ ఫౌండేషన్ ఐ ఆస్పత్రి లో అరుదైన శస్త్రచికిత్స
విశాఖ నగర పరిధిలోని శంకర్ ఫౌండేషన్ ఐ ఆస్పత్రి వైద్యులు బుధవారం అర్ధరాత్రి అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి కంటిలో నుంచి సుమారు 15 సెంటీమీటర్ల నులిపురుగును తొలగించారు.
పెందుర్తి కి చెందిన బి భారతికి కొద్ది రోజుల క్రితం కంటినొప్పి ప్రారంభమైంది.స్థానిక వైద్యులకు చూపించి మందులు వాడిన నొప్పి తగ్గకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సోమవారం శంకర్ ఫౌండేషన్ ఆస్పత్రికి వచ్చారు.
అక్కడ వైద్యుడు డాక్టర్ bhavan ఆమె కంటిలోపల పురుగు లాంటిది ఉన్నట్లు భావించి సీనియర్ వైద్యురాలు నజరిన్ దుస్ట్ కి తీసుకెళ్లారు. దీంతో శాస్త్ర చికిత్స కు ఏర్పాట్లు చేశారు తిరా స్కానింగ్ తీసెసమయంలో ఆ పురుగు కనిపించకుండా లోపలికి వెళ్ళి పోవడం తో ఆపరేషన్ వాయిదా వేశారు.
వైద్యుల సూచన మేరకు బుధవారం భారతికి బంధువులు సిటీ స్కాన్ చేయించారు. నివేదికతో మర్నాడు ఆస్పత్రికి వెళ్దాం అనుకునేలోపే అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో ఆమె కంట్లో ఏదో కధలుతున్నట్టు అనిపించడoతొవైద్యుల దృష్టికి తీసుకెళ్లారు.
డాక్టర్ నజరిన్అప్పటికప్పుడు శాస్త్ర చికిత్స చేసి భారతీకంటి నుంచి సుమారు 15 సెంటీమీటర్ల పొడవున్న నులి పురుగును బయటకు తీశారు. డాక్టర్ నజరిన్ మాట్లాడుతూ ఇటువంటి పురుగులు కంటి లోకి రావడం అరుదుగా జరుగుతుందన్నారు.