విజయనగరంలో సంగీత సరస్వతికి వందేళ్ల నీరాజనం, శతవసంతాల వేడుకలు

లలిత కళలకు పుట్టినిల్లు అయిన మన విజయనగరం, సుస్వరాల సరిగమలు ఈ నెలను పునీతం చేశాయి. సరిగమల సిరిసంపదలు ఈ విజయనగర పట్టణాన్ని సుసంపన్నం చేశాయి.

విజయనగర రాజుల ఆదరాభిమానాలతో ఈ గడ్డ. సంగీత ప్రపంచంన సమున్నత స్థానం లో నిలిచింది. సంగీత క్షేత్రంలో మహా రాజులు నాటిన బీజాలు.

వట వృక్షాలు ఎందరో ఉద్ధండ సంగీత సరస్వతి పుత్రులను దేశానికి అందించాయి.

ఇప్పుడు విజయనగరం పేరు చెప్పగానే ఎవరికైనా స్ఫూర్తికి వచ్చేది సంగీత కళాశాలే. 2019 ఫిబ్రవరి 5వ తేదీ నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుని. 101 వసంతంలోకి అడుగిడుతొంది.

శత వసంతాల వేడుక కు నేడే ఆరంభం. మూడు రోజులపాటు కళల కాణాచి. స్వరాల ఝరిలో ఓలాడనుంది.

దక్షిణ భారత దేశంలోనే ప్రథమ సంగీత కళాశాల విజయనగరం లో వెలిసింది. విజయరామరాజు 1919 ఫిబ్రవరి 5న విజయరామ గాన కళాశాల పేరుతో సంగీత కళాశాలను స్థాపించారు.

ఈ సంగీత కళాశాలలో మహోపాధ్యాయ నూకల చిన సత్యనారాయణ, సంగీత సుధానిధి నేదునూరి కృష్ణమూర్తి, వయెలిన్ సుధాకర్, మారెళ్ల కేశవరావు, కొమoడూరికృష్ణమాచార్యులు, ముళ్ళపూడి శ్రీరామమూర్తి, గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు, గానకోకిల పి.సుశీల, సాలూరు రాజేశ్వరరావు, శ్రీరంగం గోపాలరత్నం, ఇలా ఎందరో మహనీయులు కళాశాల పూర్వ విద్యార్థులే.

తమ ప్రతిభాపాటవాలతో విశ్వ సంగీత వేదికపై విజయనగర కీర్తిని తమ కీర్తనలో వినిపించి విజయ దుందుభి మోగించారు విజయ పతాకాన్ని వినువీధుల్లో ఎగురవేశారు.

ఈ నెల 3 ,4, 5, వ తేదీల్లో ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల శతాబ్ది మహోత్సవాల ను. అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు. అధికారులు ,నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు దేశ విదేశాల్లో స్థిరపడిన సంగీత కళాశాల.

పూర్వ విద్యార్థులు నగరానికి చేరుకుంటున్నారు. మూడవ తేదీ ఆదివారం కళాశాల సాంప్రదాయ రీతిలో పూజాదిక వేడుకలు ఆరంభంకానున్నాయి. ఉదయం 9 నుంచి 10 30 వరకు వివిధ శకట ప్రదర్శనలతో శోభయాత్ర జరగనుంది.

అనంతరం పూసపాటి విజయరామ గజపతి రాజు విగ్రహావిష్కరణ. గజపతుల వంశ పెద్దలకు సన్మానం ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఉత్సవాలను రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రారంభించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *