నీకు సచివాలయ ఉద్యోగం రాదు తెలుసుకో… సచివాలయ పరీక్షలు మూడు నెలల తరువాత నిర్వహించాలి!

Ballots are being prepared ahead of Sunday's European Elections, in Rozzano, near Milan, Italy, Saturday, May 25, 2019. Some 400 million Europeans from 28 countries head to the polls from Thursday to Sunday to choose their representatives at the European Parliament for the next five years. (AP Photo/Antonio Calanni)

ఎందుకో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ మెసేజ్ అంతా ఓపిగ్గా చదువు. సచివాలయ ఉద్యోగం రావాలంటే ఈ మెసేజ్ షేర్ చేయ్.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 22 లక్షలమంది లో 17 లక్షలమందికి పరీక్షలు వ్రాసినా ఉద్యోగాలు సంపాదించేందుకు అసలు అవకాశమే లేదు. ఈ 17 లక్షల మందికి ఎందుకు అవకాశం లేదు ? ఈ 17 లక్షలమందిలో నీవు ఉన్నావో లేదో తెలుసుకోవాలంటే ఈ మెసేజ్ అంతా ఓపిగ్గా పూర్తిగా చదువు.

ఈ 17 లక్షల మందికి న్యాయం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా, ఉలవపాడు మండలం, కరేడు గ్రామానికి చెందిన సోషల్ వర్కర్ గంజి ప్రసాద్ గారు మన ముఖ్యమంత్రి గారు తప్పక ఈ సమస్య ను పరిష్కరించి న్యాయం చేస్తారు అనే నమ్మకంతో వారికి తెలియజేసి పరిష్కరించుట కొరకు అమరావతి (తాడేపల్లి) వెళ్లి మూడు సార్లు మన ముఖ్యమంత్రి గారిని కలసే ప్రయత్నం చేశారు కానీ పోలీస్ సెక్యూరిటీ వారు అనుమతించకపోవడంతో కలిసే అవకాశం దొరకలేదు.

ఈ17 లక్షలమంది నష్టపోకుండా ,వారికి ఎలాగైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎలాగైనా ఈ సమస్య ను ముఖ్యమంత్రి జగన్ గారి దృష్టికి తీసుకెళ్లాలని స్వయానా తానే ముఖ్యమంత్రి జగన్ గారి ఫ్లెక్సీ వేయించికొని, నిన్న అనగా ఆగస్టు 12, 2019 తేదీన ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర గోడకు అంటించి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి కి 17 లక్షల మందికి న్యాయం కోరుతూ సమస్యను విన్నవించారు. ఈ వార్త కేవలం జిల్లా పేపర్ లో మాత్రమే వచ్చింది కనుక ముఖ్యమంత్రి గారికి తెలసే అవకాశం లేదు.

సోషల్ వర్కర్ గంజి ప్రసాద్ గారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారి ఫ్లెక్సీ కి ఇచ్చిన లెటర్ మరియు ఫోటో షేర్ చేస్తున్నాం. లెటర్ చదివి లెటర్ తో పాటు ఫోటోను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి చేరే వరకు షేర్ చేయండి. అప్పడు నీకు, నీతో పాటు 17 లక్షల మందికి న్యాయం జరుగుతుంది.

╭┄┅┅─══════

ముఖ్యమంత్రి గారికి ముఖ్య విన్నపము

మహరాజశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి దివ్య సముఖమునకు నమస్కరించి వ్రాయునది.

విషయం: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షల తేదీల మూడు నెలలు పొడిగించుట గురించి.

అయ్యా కృతజ్ఞతలు

మీరు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం
రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు వరంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తూ 1,26,728 ఉద్యోగాలు భర్తి కి నోటిఫికేషన్ లు ప్రకటించారు. నిరుద్యోగులకు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లు గొప్ప వరం. రాష్ట్రంలో ని నిరుద్యోగులకు ఇప్పటికీ ఇది కలో నిజమో అర్దం కావడం లేదు. నిరుద్యోగులకు మీరు ఇచ్చిన మాట నిలుపుకున్నందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

22 లక్షలు, రెండు గ్రూప్ లు

సోషల్ వర్కర్ గా ఒక ప్రదాన సమస్య ను మీ దృష్టికి తెస్తున్నాను.

ఈ ఉద్యోగాలకు 22 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 17 లక్షలమందికి పైగా అభ్యర్దులకు జరుగుతున్న అన్యాయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను.

దరఖాస్తు చేసుకున్న వారిని రెండు గ్రూప్ లుగా విభజిస్తే…

మొదటి గ్రూప్: 5 లక్షలు

గ్రూప్ 1, గ్రూప్ 2, DSC మరియు ఇతర పోటీ పరీక్షలకు గత 4 లేక 5 సంవత్సరాలుగా సిద్ద పడుతున్న వారు. రాష్ట్రంలో వీరు 5 లక్షలలోపు ఉంటారు.

రెండవ గ్రూప్: 17 లక్షలు

సచివాలయాల ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చాక దరఖాస్తు చేసశాక పరీక్ష కొరకు ప్రిపరేషన్ ప్రారంబించిన వారు. వీరిలో వివాహమై ఒక ప్రక్క కుటుంబ భాద్యతలు మోస్తూ మరొక ప్రక్క సచివాలయ ఉద్యోగ పరీక్ష కు సిద్దపడుతున్న మహిళలు అదికంగా ఉన్నారు. అలాగే ఈ నోటిఫికేషన్ లో జనరల్ అభ్యర్దులకు వయో పరిమితి 42 సంవత్సరాలు, రిజర్వేషన్ తో కలిపి 47 సంవత్సరాలతో అపూర్వ అవకాశం ఇవ్వడం తో కుటుంబ బాత్యతల వలన ఎప్పుడో పుస్తకాలు వదిలేసి ఈ పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు పుస్తకం తెరచిన వారు ప్రిపరేషన్ ప్రారంబించినవారు. రెండవ గ్రూప్ వారు 17 లక్షలకు పైగా ఉన్నారు.

20 రోజులలో అసాధ్యం

దరఖాస్తు చేసుకొనటకు నోటిఫికేషన్ లో ఇచ్చిన ఆఖరు తేది ఆగస్టు 11,2019. పరీక్షలు ప్రారంబం సెప్టెంబరు 1,2019 నుంచి. ఈ రెండు తేదీల మద్య ఉంది కేవలం 20 రోజులు మాత్రమే. 20 రోజుల ప్రిపరేషన్ ద్వారా కేవలం మొదటి గ్రూప్ లో ఉన్న 5 లక్షల మందిలోనుంచే ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే విధమైన వీరికి అంతకు ముందే సిలబస్ పై పట్టు ఉంది కనుక. మిగిలిన 17 లక్షల మందికి 90% అవకాశమే లేదు . ఎందుకంటే ఇచ్చిన సిలబస్ పై కేవలం 20 రోజుల్లో వీరు పట్టు సాదించలేరు గనుక.

రెండవ గ్రూప్ లోని 17 లక్షల మంది ఏం చదవాలో, ఎలా చదవాలో తెలియక, మీరు ఇచ్చిన ఈ అపూర్వమైన ఉద్యోగ అవకాశం వదులుకోలేక మనోవేదనతో కృంగి ఉన్నారు. రోజు రోజు కీ ఇంకా కృంగి పోతున్నారు.

అసలు సమస్య

మూడు కేటగిరి లలో నిర్వహించిబోతున్న పరీక్షలలో అందరికీ ఉమ్మడిగా పార్ట్ A క్రింద జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 75 మార్కులకు ఇచ్చారు. ఇది అందరికీ తప్పని సరి. అందరూ వ్రాయవలసిందే. పార్ట్ B క్రింద సంబందిత సబ్జెక్టు సిలబస్ 75 మార్కులకు ఇచ్చారు. పార్ట్ Aలోని మెంటల్ ఎబిలిటీ లో ఉండే అర్దిమేటిక్ ,రీజనింగ్ అనే రెండు బాగాలలో మీరు ఇచ్చిన 20 రోజుల సమయంలో కనీసం అర్దిమేటిక్ కూడా పూర్తి కాదు. ఇక జనరల్ స్టడీస్ గురించి చెప్పనవసరం లేదు. అది ఒక మహా సముద్రం. కనుక పార్ట్ A, B లలో ఇచ్చిన సిలబస్ పై అంతా బాగా చదివి, ఎక్కువ సార్లు పునశ్చరణ చేసి పట్టు సాదించాలంటే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు చదివితే 3/ మూడు నెలలో పూర్తి చేయడానికి సాద్య పడుతుంది. పైగా ప్రశ్నాపత్రం తయారి ఎపిపియస్ కి ఇచ్చారు. ప్రశ్నాలు చాలా క్లిష్టంగా ఉంటాయి.

నేను కోరుతున్నది:

పది లక్షలు పెట్టినా ఈ పరీక్ష లో ఎవరూ ఒక్క మార్కు కూడా కొనలేరు. కానీ మీరు పరీక్షల షెడ్యూల్ మూడు నెలలు వాయిదా వేస్తే ఉద్యాగానికి ఎంపిక అయ్యేందుకు కావలసిన మార్కులు పొందుకోగలరు. అంత విలువైనది ఈ సమయం.


మీరు ఇచ్చిన 1,26,782 శాశ్విత ప్రభుత్వ ఉద్యోగాలు 20 రోజుల్లో దక్కించుకునే అవకాశం సిలబస్ పై పట్టు ఉన్న కేవలం 5 లక్షలమందికే కాకుండా, మిగిలి 17 లక్షల మందికి కూడా సిలబస్ పై పట్టు సాదించి వారితో పాటు సమాన సామర్థ్యం తో పరీక్షలు వ్రాయుటకు అవకాశం ఇవ్వండి. దీని కొరకు
పరీక్షల 3/మూడు నెలలు పొడిగించండి. ఎపిపియస్ రూల్ ప్రకారం కూడా దరఖాస్తు చేసుకున్న తరువాత పరీక్ష లు నిర్వహించుట కొరకు 3/ మూడు నెలల సమయం ఇవ్వాలి.

కనుక సెప్టెంబరు 1, 2019 న జరగవసి ఉన్న పరీక్షల షెడ్యుల్ ను డిశంబర్ 1,2019 న నిర్వహించి, ఫలితాలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, పోస్టింగ్ ఆర్డర్ లు అన్నీ అదే నెలలో చేపట్టి జనవరి 1,2020 (T20) నూతన సంవత్సరం రోజున మీరు ప్రకటించిన 1,26,728 నూతన ఉద్యోగాలలో చేరునట్లు ప్రస్తుత పరీక్షల షెడ్యుల్ మార్చివలసిందిగా మా యువ ముఖ్యమంత్రి గారైన మీకు ఈ ముఖ్య విన్నపాన్ని సవినయంగా విన్నవించుకుంటున్నాను.

మీరు ఉన్నారు కనుక మీరు విన్నారని, తప్పక నెరవేరుస్తారని నమ్ముతున్నాను.

ఇట్లు
తమ విదేయులు
-గంజి ప్రసాద్ MSW
కరేడు గ్రామం, ఉలవపాడు మండలం, ప్రకాశం జిల్లా
మొబైల్ & వాట్సాప్: 9493927712

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *