వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీత, మత్స్యకార మహిళలకూ..ఒక్కొక్కరికి రూ.75వేలు, YS Jagan కీలక నిర్ణయం!

ఏపీలో మహిళలకు తీపి కబురు.. ఒక్కొక్కరికి రూ.75వేలు, YS Jagan కీలక నిర్ణయం
ఈ పథకాన్ని మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు.
ఇప్పటికే వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ప్రతి నెలా పెన్షన్ అందుకుంటున్న పలు వర్గాల మహిళలకు కూడా నాలుగేళ్లలో రూ.75 వేలు అందించాలని ఆదేశించారు.
ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ పథకాన్ని మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు.
ఇప్పటికే వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ప్రతి నెలా పెన్షన్ అందుకుంటున్న పలు వర్గాల మహిళలకు కూడా నాలుగేళ్లలో రూ.75 వేలు అందించాలని ఆదేశించారు.
ఈ నిర్ణయంతో పెన్షన్ కానుక అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీత, మత్స్యకార మహిళలకూ లబ్ది చేకూరనుంది. 8.21 లక్షల మందికిపైగా మహిళలకు ఈపథకం అందనుంది ఏపీ మంత్రి కారులో భారీగా డబ్బు, బంగారం సీజ్!.. ఏం జరిగిందంటే!
ఎన్నికల సమయంలో ఈ పథకం అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలందరికీ ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు.
ఇప్పటికే లబ్ధిదారులు జూన్ 28 నుంచి దరఖాస్తులు ఇచ్చారు. కానీ ప్రభుత్వ పింఛన్ తీసుకుంటున్న మహిళలకు కూడా జగన్ ఇప్పుడు అవకాశం కల్పించారు.
ఆర్థికంగా భారమైనప్పటికీ వారికి కూడా వైఎస్సార్ చేయూత కింద ప్రయోజనాలను అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆమేరకు వారినీ పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.1,540 కోట్లకు పైగా, నాలుగేళ్లలో రూ.6,163 కోట్ల మేర ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుంది.