ఢిల్లీలో ఒకేరోజు ఇద్దరు తెలుగు చంద్రులు వాళ్లే కేసీఆర్ మరియు చంద్రబాబు నాయుడు రక్తి కట్టనున్న రాజకీయము

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు మంగళవారం ఢిల్లీలో మెరుస్తున్నారు. ఎవరి schedule వారిదే అయినా , ఒకేరోజు ఇద్దరు చంద్రులు ఢిల్లీలో పర్యటనలో ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అమరావతిలో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆహ్వానించేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీ కి వస్తున్నారు. ఇదే సమయంలో వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతోనూ ఆయన సమావేశం కానున్నారు. అలాగే బుధవారం జరుగనున్న బీజేపీ యేతర పక్షాలో భేటీలోనూ చంద్రబాబు పాల్గొంటారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రాజధాని పర్యటనకు వెళుతున్నారు.

ఢిల్లీలో జరిగే కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులు కూడా కలవనున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ యేతర పక్షాలు తమ తమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్న వేల కేసీఆర్, చంద్రబాబు, ఢిల్లీలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది.

బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో చంద్రబాబు, బీజేపీ నేతలతో కేసీఆర్ కలవనుండటం గమనార్హం. కోల్ కతా సభకు మంచి స్పందన రావడంతో మరిన్ని సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఎన్డీయేతర పక్షాలు భేటీ కానున్నాయి. ఈ సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం ఢిల్లీకి వెళుతున్నారు. సీఎం చంద్రబాబు. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టవలసిన కార్యక్రమాలు రూట్ మ్యాప్ ను ఖరారు చేయనున్నారు. ఢిల్లీ, బెంగళూరు తో పాటు చంద్రబాబు సర్కారు చేపట్టిన ‘ధర్మ పోరాట’ ఆఖరి సభను ఫిబ్రవరి 13న భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ సభకు బీజేపీ యేతర పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు. మెజార్టీ నేతలు ఓకే చెబితే ఆ తేదీని ఖరారు కావచ్చని అంటున్నారు. ఇతర రాష్ట్రాల నేతలు సర్దుబాటు కోరితే స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ -టీడీపీ మధ్య పొత్తు లేకపోవడంతో టీడీపీ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వస్తారా? లేదా? అన్న దానిపై తర్జనభర్జన జరుగుతుంది. అమరావతి సభలో రాహుల్ చేత హూదాపై ప్రకటన చేయిస్తే ధర్మ పోరాట సభల కు సరైన ముగింపు వుంటుందని అంచనా వేస్తున్నారు నేతలు. ఇదే క్రమంలో ప్రజల్లోకి ఎలాంటి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చూసుకోవాలని అధినాయకత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *