డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రికలు వారికి మరో రెండు నెలలోనే 10 వేలు వేస్తాను అంటూ డ్వాక్రా మహిళలకు చంద్రబాబు నాయుడు ప్రకటన

AP CM chandrababu naidu Face TO Face Dwakra Womens


సమాజంలో మహిళలుకు గౌరవం పెరగాలనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల శక్తి డోక్రా మహిళల కే ఉందని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూర్లు మండలం నేలపాడు లో నిర్వహించిన పసుపు కుంకుమ సభలో సీఎం మాట్లాడారు. నాలుగున్నరేళ్ల పసుపు కుంకుమ కింద రూ 21,116 కోట్లు అందజేశామని చెప్పారు. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆడబిడ్డలు ఆధార పడకూడదని సీఎం అన్నారు. రాబోయే రెండు నెలల్లో ఒక్కొ డోక్రా మహిళా బ్యాంకు ఖాతాలో పదివేలు చొప్పున జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. మూడు విడతలుగా చక్కల రూపాయల్లో వాటిని అందజేస్తామన్నారు దీనికోసం మొత్తం 9,400 కోట్లు ఇస్తామని.
వడ్డీ మాఫీ కోసం రూ. 11,118 కోట్లు చెల్లించాలని చెప్పారు సీఎం ప్రకటనతో సభలోని మహిళలు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
ప్రపంచంలో ఎక్కడైనా మహిళలకు 20, 000 సాయం చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. డ్వాక్రా సంఘం తన మానసపుత్రిక అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు అందుకే ఎప్పటికీ తన మనసులో డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రత్యేక స్థానం ఉంటుందని… వారికి స్మార్ట్ ఫోన్ కూడా అందజేస్తామని సీఎం ప్రకటించారు కోటి 40 లక్షల మందికి అందిస్తామని స్పష్టం చేశారు. స్మార్ట్ఫోన్తో అన్ని పనులను ఇంట్లో నుంచి చక్కబెట్టుకోవచ్చు అన్నారు మహిళ సాధికారత దిశగా కృషి చేస్తున్నట్లు చంద్రబాబు విమరించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలోనూ మహిళలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అన్నారు. డోక్రా సంఘాలకు, కళ్యాణ మిత్ర, డిజిటల్ మిత్ర వంటి బాధ్యతలు అప్పగించామని.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సంఘాలు అద్భుతంగా నిర్వహిస్తున్నాయని సీఎం కితాబిచ్చారు.
మహిళలకు హెల్త్ కార్డులు ప్రతి మహిళా పారిశ్రామిక వేత్తగా తయారు కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు ప్రకృతి సేద్యం పెరగాలని ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. ప్రపంచానికి ప్రకృతి సేద్యం అనే బహుమానాన్ని మన రాష్ట్రమే ఇవ్వాలని చెప్పారు. 94 లక్షల మందికి 10000 ఇవ్వడం ద్వారా కుటుంబ ఆదాయం పెంచడమే తన లక్ష్యమన్నారు. మహిళల ఆరోగ్యం పై త్వరలో హెల్త్ కార్డు కూడా రూపొందిస్తామని వెల్లడించారు. డ్వాక్రా మహిళలు అండగా ఉంటే తనను ఎవరూ ఏమీ చేయలేరని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *