ఓ… నా ప్రేగు బంధమా….!🙏🙏🙏

*******
నిన్ను కన్న అమ్మని రా నేను,
విచిత్రమేమిటంటే -నీకు నచ్చాల్సిన ‘కొమ్మ’ నీ నేనే!

తరతరాలుగా, యుగ యుగాలుగా –
నిన్ను కంటూ, నా కన్నీటిని తుడుచుకుంటూ –
ముందుకు సాగె –
నా నుదుటి బొట్టునీ – కాలి మెట్టెనూ – కన్నీటి చుక్కనూ నేను!

ఈ భావి భారత సంద్రాన –
నా ఆజన్మామ్తము –
నువ్వు గీసిన గీతలో – ఓ కట్టు బానిసని రా నేను – కాదనగలవా??

ఇప్పటికీ నేనో లక్ష్మిని, నేనో దేవతని –
నేనో గోమాతను – భూమాతను -అవునా కదా!???
నా కింకా ఎన్ని పేర్లు పెడతావురా ?
నీ ఇంట నచ్చే పతివ్రతను, ఇంకా – ను బైట మెచ్చే ‘పతిత’నూ నేనే !
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా – నాకు ఎన్ని గౌరవాలు/అగౌరాలు అంటగడతావురా?

నా స్వతంతర్యాన్ని హరించడం కోసం – నా కిన్ని పేర్లు అవసరమా రా ?
భగవద్గీతని, బైబిల్ ని , ఖురాన్ని నువ్వే రాసావ్ – వాటిల్లో నా స్థానమెక్కడ రా ?
ఏరా నా స్థానమెక్కడ?
నా పేగు భంధమా … నా స్థానమెక్కడ?ఇప్పటికీ నిన్ను నేనే కనాలి, కనాలంటే 9 నెలలు నిన్ను నేనే మొయ్యాలి!
….

మాకు –
వేవీళ్ళొస్తే – వాంతులు వస్తే –
మెన్షన్సొస్తే- పురుడులు వొస్తే –
యిప్పటికీ –
రోతలు, రోతలు – రోతలు మీకవి కురూపుల్లారా, వెధవల్లారా,
వారగబెట్టి వేరుగా జూస్తరు, కాదనగలవా ???!!
ఇప్పటికీ నేను నీ అమ్మనే రా!
నీకు చనుబాలు పట్టిన దానినే !
ఇక మారాల్సింది నువ్వే!
మారతావో, మరేవో నీ ఇష్టం రా!


నన్ను దేవతగా పూజించక్కర్లేదు ,,, ఓ మనిషి గా గౌరవిస్తే చాలు అని మనవి చేసుకొంటూ… బ్రతకనీయండిరా … 🙏మమ్మల్ని !!🙏🙏🙏
——-హరి తేజ (మీ సోదరి)
(యిప్పటికీ బలవుతున్న దిశా, నిర్భయ లను గుర్తు చేసుకొంటూ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *