ఐదేళ్ల పాలనను మర్చిపోండి…ఈ మూడు నెలలు మాత్రం గుర్తు పెట్టుకోండి అంటున్న చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు ఎడాపెడా వరాలు ఇచ్చేస్తున్నాడు. జగన్ ఇచ్చిన హామీలను అమలు చేసేస్తూ. ఈ నలభై యేళ్ల అనుభవం వ్యక్తి ఎన్నికల రాజకీయం చేసేస్తూ ఉన్నాడు. అయితే ఆఖరి నిమిషంలో వరాలు ఇచ్చేస్తే అంత హ్యాపీ అయిపోతారనే లెక్కలు వర్కవుట్ అవుతాయా? అనేది సందేహమే బాబు పాలన మీద ఇప్పటికే ప్రజలకు ఒక అంచనాకు వచ్చారనేది నిజం. వచ్చే టర్మ్ బాబుకు చాన్స్ ఇవ్వాలా వద్దా.. అనేది అంశం గురించి ప్రజలు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చేసి ఉంటారు కూడా.. ఆ పల్స్ ఏ సర్వేలకూ , ఎలాంటి విశ్లేషకులు కూ దొరకదు కానీ… ప్రజలు ఒక ఒపీనియన్ కు వచ్చే సి ఉంటారనేది మాత్రం నిజం. అయితే చంద్రబాబు మాత్రం ఆఖర్లో ఏవేవో వివరాలు ఇస్తున్నాడు.
పెన్షన్లు మొత్తం రెట్టింపు , కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అంట! ఇక ట్రాక్టర్లకు, ఆటోలకు పన్నులు ఎత్తివేత… గట్రా హామీలను అమలయ్యాయిపో.. అంటోంది చంద్రబాబు ప్రభుత్వం. వీటిల్లో పెన్షన్ల మొత్తం పెంపు, ఆటోలో పన్నులు వంటివి జగన్ ఇచ్చిన హామీలు. వాటిని కాపీ కొట్టి బాబు ఆకట్టుకోవాలని చూస్తూన్నాడు. అయితే ప్రజలు ఏమీ మరీ వెర్రి బాగులోళ్లు కాదు. బాబు లెక్కలు వాళ్లు ఇలా ఆఖర్లో చిల్లర్లు విసిరేస్తే హ్యాపీ అయిపోతారు… ఐదేళ్ల తనకు ఇష్టం వచ్చిన పాలన సాధించుకోవచ్చు అని బాబు అనుకుంటున్నట్టుగా ఉన్నాడు. ఇలా ఆఖర్లో ఇవ్వడం అనేది ఒక్కసారి ఎదురుతతుంది కూడా. ఇది చరిత్ర చెబుతున్న విషయం. గతంలో కూడా ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలను ఆఖరి నిమిషంలో తాము అమలు చేసేశాం.. అనిపించిన రాజకీయ నేతలు ఎన్నికల్లో చిత్తు అయినా సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రజలను ఒకరకంగా ఫూల్స్ చేయాలని చూడోచ్చు కానీ మరీ వారిని వెర్రివాళ్ల కింద జమకడితే రాజకీయ నేతలు ఎవరైనా అందుకు తగిన ప్రతిఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *