ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. మహిళలకు జగన్ సర్కార్ తీపి కబురు!

ఏపీ కేబినెట్ కీలక సమావేశంలో కీలక నిర్ణయాలు. వైఎస్సార్ చేయుత పథకం వెనుకబడిన వర్గాలకు చెందిన 25లక్షలమందికి పైగా మహిళలకు వర్తింపు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 22 అంశాలపై చర్చించారు.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్సార్ చేయుత పథకం వెనుకబడిన వర్గాలకు చెందిన 25లక్షలమందికి పైగా మహిళలకు వర్తింపు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల సందర్భంగా మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ.. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో మహిళల ఖాతాల్లో రూ. 18,750 చొప్పున జమ చేయనున్నారు.
ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో నాలుగు విడతల్లో రూ. 75వేల రూపాయలు అందించనున్నారు.
ఆగస్టు 12న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఏపీ కేబినెట్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నారు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి: ఏపీ కేబినెట్ భేటీ: కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక నిర్ణయం.. 25 కాదు 26!
ఇక నాడు-నేడు కార్యక్రమాల్లో భాగంగా స్కూళ్లలో మౌలిక వసతులు పెంచుతున్నామని.. మళ్లీ నిధులు విడుదల చేసినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.
నాడు – నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించి జీఓ ఎంఎస్ 22కు కేబినెట్ ఓకే చెప్పింది.
మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లు, కాలేజీల్లో నాడు –నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 420 టీచింగ్, 170 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో సీపీఎస్ వద్దని ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసనలు చేయగా.. వారిపై కేసులు నమోదు చేశారని.. వాటిని ఎత్తివేస్తన్నుట్లు తెలిపారు.
గుంటూరు పాత పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారని కొంత మందిపై కేసులు పెట్టారు వాటిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కర్నూలు జిల్లా ప్యాపిలి దగ్గర రూ.5కోట్లతో గొర్రెల పెంపుకందారుల శిక్షణా కేంద్రం ఏర్పాటుకు ఓకే చెప్పారు.
అనంతపురం జిల్లాలో కూడా మరో కేంద్రం ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా కొమ్మమొర్రిలో రూ.9కోట్లతో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఒకేసారి 9712 ఉద్యోగాల్ని భర్తీ చేయాలని నిర్ణయించారు.
మిగిలిన నిర్ణయాలు ఇలా ఉన్నాయి..
- స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్‌లో 28 పోస్టులకు కేబినెట్ ఆమోదం. 13 పోస్టులు డిప్యుటేషన్ ప్రాతిపదికన, 1 కాంట్రాక్టు ప్రాతిపదికన, 14 పోస్టులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మంజూరు.
- 10వేల మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు. దీనికోసం ఏపీ అగ్రికల్యర్ ల్యాండ్ యాక్ట్ –2006 ( కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్) సవరణకు కేబినెట్ ఆమోదం.. దీనిపై ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయం.
- రెన్యుబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ విధానం–2020 కి కేబినెట్ ఆమోదం. రాష్ట్రం వెలుపల రెన్యుబుల్ ఎనర్జీ ఎగుమతికి వీలుగా విధానం
సంప్రదాయేతర కరెంటు ఉత్పత్తి, ఆ ప్రాజెక్టులకు ప్రోత్సాహించే దిశగా ప్రభుత్వం చర్యలు. ఈ రంగంలో మరింత మంది పెట్టుబడి దారులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం చర్యలు. - 10వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం. రైతులకు పగిటిపూట ఉచిత కరెంటు ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఈ కీలక ప్రాజెక్టులను తీసుకొస్తున్న ప్రభుత్వం.. తక్కువ ఖర్చుకు కరెంటు వచ్చేలా, వీలైనంత ప్రభుత్వంమీద ఆర్థిక భారం తగ్గేలా ఒప్పందానికి ఆమోదం. 25 ఏళ్లకు పీపీఏ కుదుర్చుకోవాలని నిర్ణయం.
- రాయలసీమ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ ప్రాజెక్టుల సామర్థ్యంపెంపు, కాల్వల విస్తరణ పనులకోసం స్పెషల్ పర్పస్ వెహికల్‌కు కేబినెట్ ఆమోదం.దీనికోసం ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కరువు నివారణా ప్రాజెక్ట్స్, డెవలప్మెంట్ కార్పొరేషన్ ( ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్)కు కేబినెట్ అంగీకారం
100 శాతం ప్రభుత్వం కంపెనీగా వ్యవహరించనున్న ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్ క్యాపిటల్ అవుట్ లే రూ. 40వేల కోట్లుఈ డబ్బుతో వరద వచ్చే కాలంలోనే నీటిని తాగు, సాగునీటి కొరతతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతానికి తరలించడానికి పనులు చేపట్టనున్న ప్రభుత్వం. - గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల కోసం రూ.145.94 కోట్ల రూపాయలను విడుదల, దీనికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
గండికోటలో 27 టీఎంసీల నీటిని నిల్వచేసేందుకు సత్వర చర్యలు చేపడుతున్న ప్రభుత్వం. - రూ.2వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతి.. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ అనుమతి.
- ఏపీ స్టేట్ ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్కు డైరెక్టర్ పోస్టు మంజూరుచేస్తూ కేబినెట్ నిర్ణయం.
- 31 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ల పోస్టులను అసిస్టెంట్ డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్లుగా అప్‌గ్రేడ్‌కు కేబినెట్ ఆమోదం.
- సీఐడీలో 10 జూనియర్ అసిస్టెంట్లు, 10 స్టెనో పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం
- ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ –2020 కి కేబినెట్ ఆమోదం. దీనిపై ఆర్డినెన్స్ తీసుకు రానున్న ప్రభుత్వం
ఆక్వారైతులకు నకిలీ ఫీడ్ల బెడదనుంచి విముక్తి.. ఈ యాక్ట్ ద్వారా అనైతిక చర్యలకు అడ్డుకట్ట వేసేదిశగా చర్యలు. ఆక్వాసాగులో 60శాతం నిర్వహణ ఖర్చులు ఫీడ్ ద్వారానే రాష్ట్రంలో దాదాపు రూ. 17వేల కోట్ల విలువైన ఫీడ్ బిజినెస్. తయారీ దారులు సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో నష్టపోతున్న ఆక్వా రైతులు. వీరిపై నియంత్రణ, పర్యవేక్షణకు వీలు కల్పిస్తున్న చట్టం.ప్రత్యేక లేబొరొటరీల ద్వారా ఎప్పటికప్పుడు నాణ్యతను పర్యవేక్షించనున్న ప్రభుత్వం. - కపడజిల్లా వెంకటంపల్లెలో వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీ కింద ఉన్న అరటి పరిశోధనా సంస్థలో 11 పోస్టుల మంజూరుకు కేబినెట్ అంగీకారం.. ఇందులో 5 టీచింగ్ పోస్టులు, 6 నాన్ టీచింగ్ పోస్టులు.
- ఆచార్య ఎన్జీరంగా యూనివర్శిటీ గుంటూరులో హోంసైన్స్ విభాగంలో 2 ప్రొఫెసర్, 4అసోసియేట్ ప్రొఫెసర్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం.
- ఇసుకకు సంబంధించిన వ్యవహారాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. గతంలో ఏపీఎండీసీ కింద ఇసుక కార్పొరేషన్ .. ఏపీఎండీసీకి పనిభారాన్ని తగ్గించేదిశగా ఇసుక కార్పొరేషన్. ఇసుక మినహా మిగతా ఖనిజాల వ్యవహారాలన్నీ ఏపీఎండీసీకి
ఇసుక కార్పొరేషన్‌పై ముగ్గురు మంత్రుల కమిటీ పర్యవేక్షణ. ఎప్పటికప్పుడు ఇసుక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు మంత్రుల కమిటీ
తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్న మంత్రుల కమిటీ.. మంత్రుల కమిటీలో కొడాలినాని, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్.