ఏటా 5 రోజులు అడవిలో ఉండేవాడిని: మోదీ

డీల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తాను యువకుడిగా ఉన్నప్పుడు చేసిన పనులు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

హ్యూమన్స్ ఆఫ్ బుక్ పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను గుర్తుతెచ్చుకున్నారు.

తాను యువకుడిగా ఉన్నప్పుడు ఏటా దీపావళి సమయంలో ఐదు రోజుల పాటు అడవిలోకి వెళ్లి పోయేవాడినని, ఎవరి లేని చోటు కు వెళ్లి ప్రశాంతంగా గడిపేవాడినని చెప్పారు.

దీనికోసం స్వచ్ఛ్ మైన నీరు ఉన్న చోటును ఎంచుకునే వాడినని, సరిపడా ఆహారం తీసుకెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. రేడియో, దినపత్రికలు ఏమీ లేకుండా గడిపే వాడిని అన్నారు.

అది తనను తాను మెరుగుపరుచు కోవడానికి ఎంతో ఉపయోగపడిందన్నారు.

అప్పట్లో టీవీ ఇంటర్నెట్ లేవని చెప్పారు. బిజీ జీవితాలకు దూరంగా అలా గడపడం చాలా హాయిగా అనిపించే అని చెప్పారు.

రోజువారీ హడావుడి జీవితాలకు విరామం ఇచ్చి.. కొంత సమయం మీతో మీరు గడిపితే అది ఎంతో ఉపయోగపడుతుందని యువతులకు సలహా ఇచ్చారు.

అప్పుడే నిజమైన ప్రపంచంలో జీవించడం మొదలు పెడతారన్నారు. అప్పడు మీ పై మీకు నమ్మకం పెరుగుతుందని, ఇతరులు మీ గురించి ఏం చెప్తున్నారో అర్థం చేసు కోగలుగుతారని సూచించారు.

మీకు మీరే ప్రత్యేకమని , ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూద్దని పేర్కొన్నారు.

మోదీ ఈ ఇంటర్వ్యూలో తన బాల్యం గురించి మాట్లాడారు. 17 ఏళ్ల వయసులో రెండు సంవత్సరాల పాటు హిమాలయాలకు వెళ్లినట్లు తెలిపారు.

హిమాలయాల నుంచి వచ్చిన తరువాత ఇతరులకు సేవ చేసేందుకు నా జీవితాన్ని ఉపయోగించాలనుకున్నాను.

ఆ తరువాత ఆహ్మాదాబాద్ వెళ్లాను. పెద్ద నగరంలో జీవించడం అప్పుడే తొలిసారి. అక్కడ అప్పుడప్పుడూ మా అంకుల్ కు క్యాంటీన్లో సాయం చేసే వాడిని అదే సమయంలో ఆర్ఎస్ఎస్ లో పూర్తిస్థాయి ప్రచారక్ గా మారాను.

అప్పుడే ప్రజల జీవితాల గురించి తెలుసుకోవడం ఆరంభించాను. ఇతరులతో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యాలయం శుభ్రం చేసే వాడిని, టీ , ఆహారం తయారు చేయడం, పాత్రలు శుభ్రం చేయడం లాంటి అన్ని పనులు చేసేవాడినన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *