నచ్చిన ఛానల్ లను ఎంపిక చేసుకుని చూసే ఛానల్ కే వినియోగదారుడు డబ్బులు చెల్లించాలి

ఇక టెలివిజన్లో చూసే ఛానల్ కే వినియోగదారు డబ్బులు చెల్లించాలి.
నచ్చిన ఛానల్ లను ,ఎంపిక చేసుకునివాటికి మాత్రమే నగదు చెల్లించే విధంగా, టాయ్ తీసుకొచ్చిన కొత్త నిబంధన లుశుక్రవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి.
ఈ నూతన విధానం పై వినియోగదారులలో అవగాహన కల్పించేందుకు ఇప్పటికే ఎంఎస్ఓలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చానల్లో ధరల వివరాలను తెలియజేశారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం కేబుల్ వినియోగదారులు నెలకు 130కి 100 వరకు ఉచిత ఛానల్ చూసెసదుపాయం ఉంది.
ఇది కాకుండా మిగిలిన ఛానల్ లను చూడాలి అనుకుంటే అందుకు తగిన మొత్తాన్ని చెల్లించేవారు.
ట్రాయ్ ప్రవేశపెట్టిన నిబంధన ప్రకారం 100 ఉచిత ఛానల్కు వినియోగదారులు ప్రధానంగా చెల్లించాల్సింది 130రూ, ఇందులో ఉచిత ఛానల్ లో ఉంటాయి.
ఇవి కాకుండా సినిమాలు ,సీరియల్స్, క్రీడలు ,వార్తలు, వినోద, కార్టూన్, విజ్ఞాన , తదితర చానల్ను వీక్షించాలి అనుకుంటే, నచ్చిన వాటిని వినియోగదారుడు ఎంపిక చేసుకోవాలి.
కొత్త టారిప్ ప్రకారం ఒక్కో ఛానల్కు పది పైసల నుంచి 19 వరకు ఆయా దరలున్నాయి. కొత్త విధానంలో 130 తోపాటు ఎంపిక చేసుకున్న చానళ్లకు ఆపరేటర్కు జీఎస్టీతో చెల్లించాల్సి ఉంటుంది.
వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఎంఎస్ఓలు కూడా ప్యాకేజీలను ప్రవేశపెట్టారు. ఈ వివరాలను 999 నంబరు గల చానల్లో ప్రసారం చేస్తున్నాయి. ఇతర వివరాలకు కేబుల్ ఆపరేటర్లు గాని , ఎంఎస్ ఓలను గాని సంప్రదించవచ్చు.