విమానంలో సాంకేతిక లోపం, ఆందోళనలో ప్రయాణికులు

కెనడాలోని క్యూబెక్ సిటీ ఎయిర్ పోర్టు లో టేకాఫ్ కు సిద్ధం గా ఉన్న విమానంలో 185 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
విమానం ఎక్కిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే అందరూ వాంతులు చేసుకున్నారు.
దీనితో ఎయిర్పోర్టు సిబ్బంది తక్షణమే స్పందించి ప్రయాణికులందరినీ సమీప హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిస్తున్నారు.
వీరిలో 10 మంది ప్రయాణికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. విమానాన్ని పరిశీలించిన పోలీసులు విమానంలో ఎలాంటి లోపం లేదని నిర్ధారించారు.
ఎయిర్ పోర్ట్ అధికారి మాట్లాడుతూ వెంటిలేషన్ సమస్య వచ్చి ఉండవచ్చని అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది.