జూన్ 15న గల్వాన్ ఘర్షణల్లో గాయపడిన జవాన్లను కలిసి మాట్లాడారు.

మీలాంటి ధీర జవాన్ల వల్లే నేనీ మాటలు చెబుతున్నా: మోదీ
Ladakh: గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో గాయపడ్డ సైనికులను ప్రధాని మోదీ కలిశారు.
వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి పలుకరించారు. వారిలో మరింత ధైర్యం నింపారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (జులై 3) ఉదయం లడఖ్‌లో పర్యటించారు. తనదైన చర్యతో దేశవాసులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.
సరిహద్దులో గిల్లిఖజ్జాలు పెట్టుకుంటున్న దేశాలకు గట్టి హెచ్చరికలు చేశారు. త్రివిద ధళాల మహాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణేతో కలిసి ప్రధాని మోదీ లడఖ్, లేహ్‌లో పర్యటించారు.
తన పర్యటనలో భాగంగా జూన్ 15న గల్వాన్ ఘర్షణల్లో గాయపడిన జవాన్లను కలిసి మాట్లాడారు.
మన దేశం ఇప్పటివరకూ ఏ ప్రపంచ శక్తి వద్దా మోకరిల్లలేదు.. ఇకపైనా ఆ పనిచేయదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
‘మీ లాంటి ధైర్యవంతులైన సైనికుల వల్లే నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నా’ అని లేహ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ఉద్దేశించి అన్నారు.
ప్రధాని మాటలు సైనికుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.